ఇస్మార్ట్ శంకర్ 5 డేస్ కలెక్షన్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి
దేశ వ్యాప్తంగా థియేటర్స్‌లో 'ఇస్మార్ట్ శంకర్' హంగామా కొనసాగుతోంది. మాస్ ఆడియన్స్ ఈలలు, గోలల నడుమ కాసుల వర్షం కురుస్తోంది. జులై 18వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. హీరో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్, పూరి మార్క్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ అందించిన బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి.
తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 7.8 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన 'ఇస్మార్ట్ శంకర్' ఐదో రోజు ముగిసే సరికి 23.73 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏరియా వైస్‌గా చూస్తే నైజాంలో 10.54 కోట్లు, సీడెడ్‌లో 4.07 కోట్లు, నెల్లూరులో 0.80 కోట్లు, గుంటూరులో 1.47 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.17 లక్షలు, కృష్ణాలో 1.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.46 కోట్లు రాబట్టింది. ఓవర్‌సీస్ మార్కెట్ లో మాత్రం కాస్త డీలా పడింది ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా.. వసూళ్ల పరంగా ఈ వారంలో మరింత ముందుకు వెళ్లొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ ఆడియన్స్ దిమాక్ ఖరాబ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











