ఛార్మి సంబరం.. నిధి అగర్వాల్ దిం దిం దిమాక్ ఖరాబ్.. 6 రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్
ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్స్‌లో 'ఇస్మార్ట్ శంకర్' హవా నడుస్తోంది. పూరి జగన్నాథ్ మాస్ మసాలా పవరేంటో చూపిస్తూ ఓ రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన 4 రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. దీంతో ఖుషీ ఖుషీగా ఉన్న ఛార్మి.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా 6 రోజుల కలెక్షన్స్ తాలూకు పోస్టర్ పంచుకుంది.
ఈ పోస్టర్ ద్వారా 6 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది తెలిపింది. ఈ మేరకు 'బ్రింగ్ ఇట్ ఆన్ గైస్' అని పేర్కొంటూ స్మైలింగ్, డాన్సింగ్ ఎమోజీలు పోస్ట్ చేసింది. మరోవైపు ఇదే పోస్టర్ షేర్ చేసిన నిధి అగర్వాల్.. 'ఎక్కడ చూసినా దిం దిం దిమాక్ ఖరాబ్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి' అని పేర్కొంది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన మాస్ మసాలా స్ట్రోక్ యూత్ ఆడియన్స్‌కి యమ కిక్కించింది. తొలి వీకెండ్ ముగిసినా కూడా కలెక్షన్స్ ప్రవాహం ఆగటం లేదు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేస్తోంది. పూరి జగన్నాథ్ సహా హీరో రామ్, హీరోయిన్లు నిధి, నభా ఇద్దరికీ ఈ సినిమా అందించిన విజయం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్న చిత్రయూనిట్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులకు పలకరిస్తూ వస్తోంది.


Click it and Unblock the Notifications











