'ఇస్మార్ట్ శంకర్' ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్

Recommended Video

Ismart Shankar Boxoffice Collections Day 1 || Ram Pothineni || Puri Jagannadh || Filmibeat Telugu

పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. జులై 18 వ తేదీన విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది.

హీరో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్, పూరి మార్క్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ అందించిన బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి. తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 7.8 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఈ మేరకు కలెక్షన్ రిపోర్ట్ తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. తొలి రోజు మొత్తంగా 16 కోట్ల షేర్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్.

puri jagannadhs ismart shankar first day collections

ఏరియా వైస్‌గా నైజాంలో 3.43 కోట్లు, సీడెడ్ లో 1.20 కోట్లు, వైజాగ్ లో 86 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 50 లక్షలు, వెస్ట్ గోదావరిలో 40 లక్షలు, కృష్ణాలో 53 లక్షలు, గుంటూరులో 57 లక్షలు, నెల్లూరులో 30 లక్షలు వసూలయ్యాయని పీఆర్వో బీఏ రాజు ట్విట్టర్ ద్వారా తెలిపారు. వసూళ్ల పరంగా ఈ సినిమా మరింత పుంజుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X