twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలి వారం ముగిసింది.. కుమ్మేసిన ఇస్మార్ట్ శంకర్.. ఎంత రాబట్టిందంటే!

    |

    డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ చాలా రోజుల తర్వాత సక్సెస్ టేస్ట్ చూశారు. 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో సూపర్ డూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. జులై 18వ తేదీన విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మాస్ ఆడియన్స్ ఈలలు, గోలల నడుమ కాసుల వర్షం కురిపిస్తోంది. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత మెల్లగా పుంజుకొని డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ వస్తోంది. హీరో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్, పూరి మార్క్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌ని కట్టి పడేస్తున్నాయి. మణిశర్మ అందించిన బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 27.67 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఏరియా వైస్‌గా చూస్తే నైజాంలో 11 కోట్లు, సీడెడ్‌లో 4.20 కోట్లు, నెల్లూరులో 0.83 కోట్లు, గుంటూరులో 1.67 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.33 కోట్లు, కృష్ణాలో 1.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.62 కోట్లు రాబట్టింది. ఓవర్‌సీస్ మార్కెట్‌లో మాత్రం కాస్త డీలా పడింది ఇస్మార్ట్ శంకర్. సినిమా విడుదలై తొలివారం ముగిసే సరికి ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25. 22 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.

    Puri Jagannadhs ismart shankar First Week collection Report

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ ఆడియన్స్‌ని థియేటర్ల బాట పట్టిస్తోంది.

    English summary
    Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens hilighted in this movie. This movie first week collection report is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X