Vettaiyan Day 10 Collection: వీకెండ్ లో పుంజుకున్న వసూళ్ళు .. 10వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 10 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ - బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్. ఈ మల్టీ స్టారర్ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ అంచాలతో విడుదల అయిన విషయం తెలిసిందే. జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్ తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త బెటరే అనిపిస్తోంది. ఇంతకీ వేట్టయాన్ విడుదలైన పదవ రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ? రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జై భీం ఫేమ్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన వేట్టయాన్ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతో పాటు మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ మల్లీ స్టార్స్ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ యాక్షన్ మూవీ కోసం దాదాపు 300 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు టాక్. రజనీ మాస్ , జ్ఞానవేల్ సామాజిక వ్యాఖ్యానం రెండూ మాస్‌లో సూపర్ డూపర్ హిట్స్ సాధించింది.

ఇక వేట్టయాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ విడుదలైన తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 31.7 కోట్లు కలెక్ట్ చేయగా.. వర్డల్ వైడ్ గా రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి..ఈ ఏడాది కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన రెండవ సినిమాగా జాబితాలో నిలించింది. తొలి రోజు నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ఎఫెక్ట్ పడింది. దీంతో రెండవ రోజు కలెక్షన్లు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. అయితే.. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా (మొదటి నాలుగు)రోజుల్లో వెట్టయాన్ రూ.240 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకేవ్ అధికారికంగా ప్రకటించింది.
Gunde Ninda Gudi Gantalu Weekly: కొడుకు చేసిన తప్పుకు తండ్రికి శిక్ష.. మరిది చేసిన పనికి రోడ్డునపడ్డ వదిన..
ఇక 5వ రోజు నుంచి వెట్టయాన్ కలెక్షన్లపై భారీ వర్షాల ప్రభావం పడింది. దీంతో వసూళ్లు తగ్గాయి. ఐదవ రోజు బాక్సాఫీస్ వద్ద వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు వసూలు చేసింది. ఇక 6వ రోజు కూడా వర్ష ప్రభావం కనిపించింది. అలా అత్యల్పంగా రూ.4.3 కోట్లు వసూలు చేసింది. 7వ రోజు రూ.4.5 కోట్లు రాబట్టింది వెట్టాయన్. 8 వ రోజు కేవలం రూ. 3.15 కోట్లు (నెట్) మాత్రమే రాబట్టింది.ఇలా మొదటి వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ 122.15 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక తొమ్మిదో రోజు రూ. 2.6 కోట్లు వసూళ్లు చేసింది వేట్టయాన్.

ఇక వేట్టయాన్ పదవ రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకింగ్ పోర్టల్ సక్‌నిల్క్ ప్రకారం.. వెట్టయన్ పదవ రోజు నాడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 4.25 కోట్లు (నెట్ ) కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ వేట్టయాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం ₹130 కోట్లు ఆర్జించినట్టు తెలుస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడం, వీకెండ్ కావడంతో థియేటర్ కు వచ్చే అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో సెకండ్ వీకెండ్ లో వెట్టయాన్ సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయని, సూపర్ స్టార్ అభిమానులు ట్విట్టర్‌లో Vettaiyan300CroreBOHunt ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











