Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన మూవీ రాకాస. ఫాంటసీ, లవ్, హార్రర్ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న రాకాస వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రాకాస క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Rakasa Box Office Collections Worldwide Niharika Konidela s film Closing Collections at Global Box Office Report

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రాకాస మూవీని ఆంధ్రా, తెలంగాణలలో 1000 స్క్రీన్లలో, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 250 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.

రాకాస కలెక్షన్స్
రాకాస తొలిరోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.14 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.06 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 60 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 45 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 51 లక్షల రూపాయలు, పదో రోజున 58 లక్షల రూపాయలు, పదకొండో రోజున 24 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 29 లక్షల రూపాయలు, పదమూడో రోజున 20 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 19 లక్షల రూపాయలు నెట్ వసూలు చేసింది. తొలివారం వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల నెట్, రెండో వారం 2.3 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది రాకాస.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో రాకాసకు ఇప్పటి వరకు 330K డాలర్లు (3.6 కోట్ల రూపాయలు) వసూలు అవ్వగా.. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి మరో 75 లక్షల రూపాయలు వచ్చింది. దాంతో ఓవర్సీస్‌లో రాకాసకు ఇప్పటి వరకు 4.40 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రాకాస మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రాకాస మూవీ ఇప్పటి వరకు నైజాంలో 4.44 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.05 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 2.10 కోట్ల రూపాయలు చొప్పున 13.80 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

రాకాసకు లాభమెంత? నష్టమెంత?
రాకాస మూవీ లాభాల్లోకి రావాలంటే 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇప్పటి వరకు రాకాస 13.80 కోట్ల రూపాయల షేర్‌తో స్వల్ప లాభాలను అందుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్‌తోనే రాకాస మూవీ సేఫ్ సైడ్‌లోకి వచ్చేసింది. ఓటీటీ హక్కులు 10 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ కోటి రూపాయలతో కలిపి 11 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.

కాలు జారితే 13500 అడుగుల లోయలోకే... దీప్తి సునైనా సాహసంఈ సినిమా బడ్జెట్ 15 కోట్ల రూపాయలు కాగా.. నాన్ థియేట్రికల్ బిజినెస్ 11 కోట్లు పోను.. మరో 6 కోట్ల రూపాయలు రాబడితే రాకాస బ్రేక్ ఈవెన్ అయినట్లే. థియేట్రికల్ రన్‌ ద్వారా దాదాపు 13 కోట్లకు పైగా షేర్ రాబట్టడంతో 7 కోట్ల రూపాయలకు పైగా లాభాలను నిహారిక కొణిదెల తన ఖాతాలో వేసుకున్నట్లే లెక్క. ఈ సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్, హిందీ శాటిలైట్ రైట్స్ ఇంకా నిహారిక దగ్గరే ఉండటంతో రాకాస మూవీతో ఆమె మరిన్ని లాభాలను అందుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X