Rao Bahadur Closing Collections: రావు బహదూర్ క్లోజింగ్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రావు బహదూర్. పీరియాడికల్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఏ+ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణా రెడ్డి, ఈశ్వరన్ విజయ రాఘవన్‌లు రావు నిర్మించారు.
జూలై 3న వరల్డ్ వైడ్‌గా రావు బహదూర్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రావు బహదూర్‌లో దీపా థోమస్ హీరోయిన్‌గా నటించారు. వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. స్మరణ్ సాయి సంగీతం అందించారు. వెంకటేష్ మహా.. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రావు బహదూర్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? సత్యదేవ్ మూవీకి లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే..

రావు బహదూర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రావు బహదూర్ మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సత్యదేవ్ క్రేజ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా రావు బహదూర్‌పై బజ్ క్రియేట్ అయ్యింది. దాంతో రావు బహదూర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ పరంగా మంచి బిజినెస్‌ను అందుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
రావు బహదూర్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
రావు బహదూర్ డిజిటల్ రైట్స్, మ్యూజిక్, శాటిలైట్, ఇతర హక్కుల ద్వారా 12 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మాతలు, జీఎంబీ సంస్థలు సొంతంగా విడుదల చేశాయి. రావు బహదూర్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువకట్టారు.
రావు బహదూర్ కలెక్షన్స్
సత్యదేవ్ మూవీకి తొలిరోజున 1.40 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.40 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.24 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 39 లక్షల రూపాయలు, ఐదో రోజున 35 లక్షల రూపాయలు, ఆరో రోజున 38 లక్షల రూపాయలు, ఏడో రోజున 29 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 23 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 17 లక్షల రూపాయలు, పదో రోజున 15 లక్షల రూపాయలు, పదకొండో రోజున 4 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 4 లక్షల రూపాయలు వసూలు చేసింది.
ఇప్పటి వరకు ఇండియాలో 6.08 కోట్ల రూపాయల నెట్.. 6.72 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా సాక్‌నిక్ నివేదించింది. తెలంగాణలో 4 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 2.87 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 77 లక్షల రూపాయలు, తమిళనాడులో 8.50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2.50 లక్షల రూపాయలు చొప్పున రాబట్టాడు రావు బహదూర్.
రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్ ఆడియన్స్‌ను రావు బహదూర్ బాగానే ఆకట్టుకుంది. నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ తర్వాతి నుంచి పరిస్ధితి మారిపోయింది. నాగబంధం, మా ఇంటి బంగారం, లెనిన్ మూవీల నుంచి రావు బహదూర్‌కు గట్టిపోటీ ఎదురవ్వడంతో తేరుకోలేకపోయింది. ఈ సోమవారం నార్త్ అమెరికాలో కేవలం 2000 డాలర్లు (1.90 లక్షల రూపాయలు) మాత్రమే వసూలు చేయగలిగింది. ఇప్పటి వరకు అమెరికా, కెనడాలలో కలిపి 403K డాలర్లు (3.87 కోట్ల రూపాయలు) మాత్రమే రాబట్ట గలిగాడు రావు బహదూర్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, గల్ఫ్ తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 436K డాలర్లు (4.15 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన కలెక్షన్స్ కలిపి సత్యదేవ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
రావు బహదూర్‌కి లాభమెంత? నష్టమెంత?
భారీ అంచనాల మధ్య విడుదలైన రావు బహదూర్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీనికి తోడు కొత్త సినిమాలు ఈ సినిమాను దెబ్బకొట్టాయి. ఫస్ట్ వీకెండ్ వరకు ఓ మాదిరిగా వసూళ్లు రాబట్టిన రావు బహదూర్.. ఫస్ట్ మండే నుంచి క్రమంగా వసూళ్లను కోల్పోయింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా.. కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దాంతో థియేట్రికల్‌గా 14 కోట్ల రూపాయల నష్టాన్ని రావు బహదూర్ మిగిల్చింది. అయితే డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయంతో నిర్మాతలు స్వల్ప నష్టాలతో బయటపడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications





