Romantic Day 4 Collections: మరింతగా పడిపోయిన వసూళ్లు. ఇంకా ఎంత రావాలంటే?

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ పడూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చార్మి పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్స్ లో నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా యువ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వసూళ్లను అందుకోలేకపోయింది. ఆదివారం తర్వాత సోమవారం నాటికి మరింతగా తగ్గిపోయాయి. ఒకసారి ఆ నెంబర్స్ పై ఒక లుక్కేస్తే..

 వరుస ఫెయిల్యూర్స్

వరుస ఫెయిల్యూర్స్

చిరుత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఆకాష్ పూరి ఆ తర్వాత బుజ్జిగాడు సినిమాలో కూడా నటించాడు. ఇక ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ధోని సినిమాలో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా ఫామ్ లోకి రావాలని అనుకున్న ఆకాష్ పూరి మొదట ఆంధ్ర పోరి అనే సినిమా చేశాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే మెహబూబా సినిమా చేశాడు. అవి కూడా అతనికి బాక్సాఫీసు వద్ద సరైన మార్కెట్ ను క్రియేట్ చెయలేకపోయాయి.

 టాప్ దర్శకుల నుంచి సపోర్ట్

టాప్ దర్శకుల నుంచి సపోర్ట్

రొమాంటిక్ సినిమాతో అయినా మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాష్ ప్రమోషన్ లో కూడా బాగానే పాల్గొన్నాడు. అతనికి ఇండస్ట్రీలోని టాప్ దర్శకుల నుంచి మద్దతు కూడా లభించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ దాదాపు అగ్ర దర్శకుల అందరిని రొమాంటిక్ సినిమా ప్రివ్యూకి ఆహ్వానించారు. సినిమాలు చూసిన తర్వాత దర్శకులందరూ కూడా ఎంతో పాజిటివ్ గా స్పందించారు. ప్రభాస్ కూడా సినిమా అద్భుతంగా ఉన్నట్లు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాడు.

3వ రోజు వచ్చిన కలెక్షన్స్

3వ రోజు వచ్చిన కలెక్షన్స్

అయితే పూరి జగన్నాథ్ ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ సినిమాను విడుదల చేశారు కానీ అవి కూడా కలెక్షన్స్ అందుకోవడంలో వర్కౌట్ కాలేదు. రొమాంటిక్ మూవీ మొదటి మూడు రోజుల్లో అనుకున్నంతగా వసూళ్లను ఏమి రాబట్టలేకపోయాయి. ఇక 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 10 లక్షలు, సీడెడ్‌లో 6 లక్షలు, ఉత్తరాంధ్రతో 5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షలు, గుంటూరులో 2.1 లక్షలు, కృష్ణా జిల్లాలో 3 లక్షలు, నెల్లూరులో 2 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో 4వ రోజు 0.32 కోట్ల షేర్ రాగా టోటల్ గా 0.50 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

 వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

మిగతా రాష్ట్రాల్లో సినిమా 4 రోజుల్లో 9 లక్షల రూపాయలను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో రొమాంటిక్ సినిమా ఎక్కువగా వసూళ్లను అందుకోలేకపోయింది. ఓవర్సీస్ లో 8 లక్షలు మాత్రమే వచ్చాయి. వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో 3.49 కోట్ల షేర్ రాబట్టిన రొమాంటిక్ సినిమా రూ.5.50 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. దీంతో సినిమా

Recommended Video

Director Maruthi Vs Anchor Manjusha Truth Or Dare | Manchi Rojulochaie
సినిమాకు ఇంకా ఎంత రావాలంటే..

సినిమాకు ఇంకా ఎంత రావాలంటే..

రొమాంటిక్ వీకెండ్స్ లోనే చాలా తక్కువ వసూళ్లను రాబట్టింది. ఇక సోమవారం వసూళ్లు చాలా తగ్గిపోయాయి. ఈ రకంగా అయినా ఈ వారం గడిస్తే సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ మూవీ రూ.4.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక సినిమా ప్రాఫిట్ లోకి రావాలి అంటే మొత్తంగా 5 కోట్ల షేర్ ను అందుకోవాలి. అయితే ఇప్పటివరకు 3.49 కోట్ల షేర్ సాధించిన రొమాంటిక్ మూవీ ఇంకా 1.51కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఆ టార్గెట్ ను ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X