Romantic Day 3 Collections: ఆదివారం కూడా బోల్తా కొట్టిన పూరి ప్లాన్.. ప్రభాస్ చెప్పినా వసూళ్లు రావట్లే!

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తను హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను అందుకోవాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. రామ్ చరణ్ చిరుత సినిమాతో వెండితెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ ఆ తర్వాత బుజ్జిగాడు సినిమాలో కూడా చిన్నప్పటి ప్రభాస్ గా కనిపించాడు. ఇక ఆంధ్రపోరి, మెహబూబా అంటూ రెండు విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫలితం దక్కలేదు. ఇక ఈసారి ఎలాగైనా రొమాంటిక్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు రోజులైనా కూడా సరైన వసూళ్లు అందుకోలేకపోయింది.

అగ్ర దర్శకుల నుంచి ప్రశంసలు

అగ్ర దర్శకుల నుంచి ప్రశంసలు

రొమాంటిక్ సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ మొదట టాలీవుడ్ చిత్ర దర్శకులకు ప్రత్యేకంగా షో కూడా వేశాడు. రాజమౌళి నుంచి అనిల్ రావిపూడి వరకు చాలా మంది దర్శకులు సినిమా చూసి అద్భుతంగా ఉంది అంటూ చాలానే పొగిడారు. అంతేకాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రొమాంటిక్ సినిమాపై చాలా పాజిటివ్ గా కామెంట్ చేయడంతో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయినట్లు అనిపించింది. ట్రైలర్ ను లాంచ్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

ప్రభాస్ చెప్పినా కూడా

ప్రభాస్ చెప్పినా కూడా

ప్రభాస్ రొమాంటిక్ సినిమాకు ప్రమోషన్ చేస్తూ ఈ సినిమాను తప్పకుండా అందరూ చూడాలి అని ముఖ్యంగా తన అభిమానులకు ప్రత్యేకంగా కోరాడు. అయితే ప్రభాస్ చెప్పినా కూడా ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. శుక్ర శని వారం రోజు సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆదివారం కూడా కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు దీంతో వారంతరం సినిమాకు కఠినమైన పరిస్థితిలు ఎదుర్కోబోతోంది.

3వ రోజు కలెక్షన్స్

3వ రోజు కలెక్షన్స్

రొమాంటిక్ మూవీ మొదటి రెండు రోజుల్లో అనుకున్నంతగా ఏమి రాబట్టలేకపోయింది. మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 26 లక్షలు, సీడెడ్‌లో 12 లక్షలు, ఉత్తరాంధ్రతో 8 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరులో 4 లక్షలు, కృష్ణా జిల్లాలో 5 లక్షలు, నెల్లూరులో 3 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో 0.65 కోట్ల షేర్ రాగా టోటల్ గా 1.05 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

 వరల్డ్ వైడ్ 3 రోజుల కలెక్షన్స్

వరల్డ్ వైడ్ 3 రోజుల కలెక్షన్స్

కర్ణాటకలో అలాగే మిగతా రాష్ట్రాల్లో సినిమా 3 రోజుల్లో 8 లక్షల రూపాయలను రాబట్టింది. పునీత్ రాజ్ కుమార్ మరణం ఈ సినిమాపై కొంత ప్రభావం చూపించినట్లు అర్ధమవుతోంది. ఇక ఓవర్సీస్‌లో రొమాంటిక్ డోస్ ఎక్కువగా వర్కౌట్ కాలేదు. ఓవర్సీస్ లో 8 లక్షలు మాత్రమే వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 3.16 కోట్ల షేర్ రాబట్టిన రొమాంటిక్ సినిమా రూ.4.75 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

Recommended Video

O Madhu Movie Trailer Is Out
సినిమా లాభాల్లోకి రావాలంటే..

సినిమా లాభాల్లోకి రావాలంటే..

రొమాంటిక్ మూవీ శుక్రవారం, శనివారలలోనే కాకుండా ఆదివారం కూడా చాలా తక్కువ వసూళ్లను రాబట్టింది. సండే వీలైనంత ఎక్కువగా వసూళ్లను అందుకుంటేనే సినిమా ఈజీగా ప్రాఫిట్ జోన్ లోకి వస్తుంది అనుకుంటే మళ్ళీ డౌన్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ మూవీ రూ.4.60 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. సినిమా ప్రాఫిట్ లోకి రావాలి అంటే మొత్తంగా 5 కోట్ల షేర్ ను అందుకోవాలి. అయితే ఇప్పటివరకు 3.16కోట్ల షేర్ సాధించిన రొమాంటిక్ మూవీ ఇంకా 1.84కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X