Singham Again Collections: 100 కోట్లకు చేరువగా సింగం అగైన్.. 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవగన్ ఫిల్మ్స్, సినెర్జీ బ్యానర్లపై రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన చిత్రం సింగం అగైన్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్ (గెస్ట్ అప్పీయరెన్స్) రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపిక పదుకోన్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, రవికిషన్, శ్వేత తివారీ తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

రోజుకు ఒక్కడితో రష్మిక మందన్న.. అలా పట్టుబడిన నేషనల్ క్రష్!
సింగం మూవీకి సీక్వెల్‌గా రోహిత్ శెట్టి మల్టీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన మల్టీ స్టారర్ చిత్రాన్ని భారీగా నిర్మించారు. అనుక్షణం థ్రిలింగ్‌గా రూపొందే ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా హై ఎండ్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో నటించిన యాక్టర్లు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

Singham Again Box Office Collections Worldwide Ajay Devgn touching 100 Crores milestone GBOC

సింగం సినిమా ప్రమోషన్స్ భారీగా జరగడం.. మూవీపై హైప్ క్రియేట్ కావడంతో రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ మూవీని ఇండియాలోనే 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో మరో 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశఆరు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు 130 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఈ సినిమా 370 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఇండియాలో ఈ సినిమా తొలి రోజు భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమా మార్నింగ్ షో 45 శాతం, మ్యాట్నీకి 75 శాతం ఫస్ట్ షోకు 80 శాతం, సెకండ్ షోకు 75 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 44 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో 500K డాలర్లు అంటే 4 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో మరో 500K డాలర్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Singham Again Box Office Collections Worldwide Ajay Devgn touching 100 Crores milestone GBOC

ఇక రెండో రోజు సింగమ్ అగైన్ సినిమా విషయానికి వస్తే.. రెండో రోజు నిలకడగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఈ సినిమా మార్నింగ్ షోకు 35 శాతం, మ్యాట్నీకి 50 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పాండిచ్చేరి, జైపూర్ తదితర ప్రాంతాల్లో మంచి స్పందన కనిపించింది.

సింగం అగైన్ చిత్రం రెండో రోజు ఈ సినిమా స్ట్రాంగ్ కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో ఈ మూవీ 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మరో 500 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా రెండో రోజు 24 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేస్తుందని పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 75 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X