The Odyssey Box Office: 23000 స్క్రీన్లలో ది ఒడిస్సీ.. నోలన్ మూవీకి వరల్డ్ వైడ్ ఎన్ని వేల కోట్ల కలెక్షన్లంటే?
హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, ఫాంటసీ చిత్రం ది ఒడిస్సీ. ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ఓపెన్సింగ్ ఎలా ఉండబోతున్నాయి? తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే వివరాల్లోకి వెళితే..

ది ఒడిస్సీ సినిమాను మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందించారు. ఈ సినిమాను ఊహకు అందని విధంగా టెక్నికల్ అంశాలు, కంటెంట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 2400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. నోలన్ సినిమాలపై ఉన్న క్రేజ్ భారీగా ఉండటంతో రికార్డు స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఒడిస్సీ సినిమాను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ కంట్రీస్, కొరియా, జపాన్, చైనా దేశాలతోపాటు మొత్తంగా 73 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సుమారుగా 23000 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. నోలన్ రూపొందించిన ఒపెన్‌హైమర్ సినిమాను సుమారుగా 17 వేల స్క్రీన్ల ప్రదర్శించారు.ఈ సినిమాకు భారీగా హైప్ ఉండటంతో రికార్డుస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం.. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు భారీ ఆదరణ కనిపిస్తున్నది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిల జరుగుతున్నది. ఈ సినిమా తొలి వారాంతం అంటే.. మొదటి మూడు రోజుల్లో 100 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంది. భారతీయ కరెన్సీలో 960 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక ఇతర దేశాల్లో ఈ సినిమా 110 మిలియన్ డాలర్లు అంటే 1050 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మొత్తంగా ఈ సినిమా 210 నుంచి 220 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఈ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇండియాలో కూడా ఈ సినిమాకు భారీ ఒపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమాను తొలి రోజు 3 వేల షోలు ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 9 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు ఈ సినిమా 20 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.


Click it and Unblock the Notifications


