The Odyssey Day 1 Box Office: ది ఒడిస్సీ మూవీకి రికార్డు ఓపెనింగ్స్.. క్రిస్టఫర్ నోలన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ది ఒడిస్సీ మూవీని ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.

ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం ఇండియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం తొలి రోజు ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

The Odyssey Day 1 Expected Box Office

ది ఒడిస్సీ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ బుకింగ్ జరిగింది. దేశంలోని ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ, పూణే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ ఆదరణ కనిపించింది. సింగిల్ థియేటర్ల కంటే మల్టీప్లెక్స్‌లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. దాదాపు ఈ సినిమాకు 45 నుంచి 55 శాతం ఆక్యుపెన్సీ దేశవ్యాప్తంగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
Lenin 8 Days Box Office: అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ కలెక్షన్లు.. లెనిన్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
Lenin 8 Days Box Office: అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ కలెక్షన్లు.. లెనిన్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

ఇండియాలో ఈ మూవీని 33 రాష్ట్రాల్లో 214 పట్టణాల్లో సుమారుగా 100 లోకేషన్లలో 1300 స్క్రీన్లలో దాదాపు 3000 షోలను ప్రదర్శిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక రాష్ట్రాల వారీగా ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో అత్యధికంగా 1.75 కోట్లు, కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 1.25 కోట్ల రూపాయలు, తెలంగాణలో 1 కోటి రూపాయలు, కేరళ, తమిళనాడులో 50 లక్షల రూపాయలు చొప్పన కలెక్షన్లను వసూలు చేశాయి. మిగితా రాష్ట్రాల్లో కలిపి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Recommended For You
The Odyssey Movie Review: ది ఒడిస్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
The Odyssey Movie Review: ది ఒడిస్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

తాజా సమాచారం ఈ సినిమా ప్రకారం.. 9 నుంచి 10 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం, రాత్రి షోలకు మంచి స్పందన ఉంటే కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ మూవీ దేశవ్యాప్తంగా తొలి రోజు 20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

You May Also Like
'91 రోజుల్లో ది ఒడిస్సీ ఫినిష్.. 14 నెలలుగా వారణాసి’
'91 రోజుల్లో ది ఒడిస్సీ ఫినిష్.. 14 నెలలుగా వారణాసి’

ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది. ఈ చిత్రం తొలి వారాంతమే 200 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X