Vettaiyan Day 8 Collection: రజనీకాంత్ వసూళ్ల వేట ముగిసినట్లేనా..8 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 8 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'వేట్టయాన్'(Vettaiyan). ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ బడ్జెట్ మూవీగా విడుదలైన వేట్టయాన్ .. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. కలెక్షన్ల పరంగా మాత్రం బెటరే అనిపిస్తోంది. ఈ క్రమంలో వేట్టయాన్ మూవీ ఎనిమిది రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
జై భీం ఫేమ్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయాన్'మూవీలో దాదాపు మూడున్నర దశబ్దాల తరువాత రజనీ కాంత్, బిగ్ బీ అమితాబ్ కలిసి నటించారు. ఇద్దరు సూపర్‌స్టార్‌లను ఒకే స్క్రీన్ పై కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాకుండా.. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ మల్లీ స్టారర్స్, భారీ బడ్జెట్ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించారు. ఈ యాక్షన్ మూవీలోని స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులతో సహా మొత్తం బడ్జెట్ 300 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు టాక్. ఈ మూవీ తొలి షో నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. రజనీకాంత్ నటన, సాంకేతిక అంశాలు ఈ మూవీకి ఫ్లస్ అంటుంటే.. కథాంశం బాగాలేదనీ, స్లో స్క్రీన్‌ప్లే మైనస్ అంటున్నారు.
ఇక రజనీకాంత్ వేట్టయాన్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లు బాక్సాఫీస్ లో రికార్డు చేశారు. ప్రధానంగా ఈ ఏడాది కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో రెండవ స్థానం దక్కించుకుంది వేట్టయాన్ ది హంటర్. అంతకుముందు విజయ్ 'ది గోట్' రూ.120 కోట్లతో తొలిస్థానంలో నిలిచింది.

'వేట్టయాన్' తొలిరోజు వర్డల్ వైడ్ గా రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. మిక్స్డ్ టాక్ రావడంతో రెండవ రోజు కలెక్షన్లు రూ. 24 కోట్లకు పడిపోయింది. మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఈ తరుణంలో రూ.50 కోట్ల మార్క్‌ను తొలి రోజే క్రాస్ చేయగా.. రూ.100 కోట్ల మార్క్‌ను 4 రోజుల్లో అధిగమించింది. అలాగే.. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా (మొదటి నాలుగు) రోజుల్లో ఈ చిత్రం రూ.240 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకేవ్ అధికారికంగా ప్రకటించింది.
లవర్స్‌గా అలాదూసుకుపోయే వాళ్లం.. రేణుదేశాయ్ షాకింగ్ పోస్ట్
ఈ వారం ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుల్లో కలెక్షన్ల దారుణంగా పడిపోయాయి. ఒక్క 5 రోజే దాదాపు 70 % కలెక్షన్లు పడిపోయాయి. 5 వ రోజు వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు వసూలు చేసింది. ఇక 6వ రోజు ఈ సినిమా అత్యల్పంగా రూ.4.3 కోట్లు వసూలు చేసింది. 7వ రోజు వెట్టాయన్ మూవీ కలెక్షన్లు కాస్త మెరుగుపడ్డాయి. బుధవారం నాడు రూ. 4.5 కోట్లు రాబట్టింది.

ఇక వేట్టయాన్ ఎనిమిదో రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకింగ్ పోర్టల్ సక్‌నిల్క్ ప్రకారం.. మొదటి వారంలో వెట్టయన్ భారతదేశంలో ₹118.95 కోట్లు(నెట్), లేదా ప్రపంచవ్యాప్తంగా ₹208.85 కోట్ల (గ్రాస్) ఆర్జించింది. కానీ, ఎనిమిదో రోజున వేట్టయాన్ మూవీ కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
తమిళనాడుతో వేట్టయాన్ మూవీ ఆక్యుపెన్సీ ఇలా ఉంది. మార్నింగ్ షోలు 13.94%, మధ్యాహ్నం షోలు 16.01%, ఈవినింగ్ షోలు 18.27%, నైట్ షోలు 18.95%. తెలుగు ఆక్యుపెన్సీ 14.40% నమోదైంది. దీంతో ఇండియన్ బాక్సాపీస్ వద్ద గురువారం నాడు వేట్టయాన్ కేవలం రూ. 3.15 కోట్లు (నెట్) మాత్రమే రాబట్టింది. ఇప్పటి వరకూ వేట్టయాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం ₹122.10 కోట్లు ఆర్జించింది.


Click it and Unblock the Notifications











