Liger Collections: లైగర్‌కు కోలుకోలేని షాక్.. 3వ రోజే ఇంత తక్కువా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా అతడు చాలా కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకపోతోన్నాడు. యాక్టింగ్‌కు యాక్టింగ్, యాటిట్యూడ్‌కు యాటిట్యూడ్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ యంగ్‌స్టర్.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.
ఇక, ఇటీవలే విజయ్ దేవరకొండ 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీకి స్పందన తక్కువగా వస్తోంది. దీంతో కలెక్షన్లు డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'లైగర్' మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

‘లైగర్'గా ఎంట్రీ ఇచ్చిన రౌడీ
విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మూవీనే 'లైగర్'. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ మూవీని ఛార్మీ, పూరీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. అలాగే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేశారు.

లైగర్ మూవీ బిజినెస్ వివరాలు
పాన్ ఇండియా మూవీగా రూపొందిన 'లైగర్'పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఆంధ్ర, తెలంగాణలో కలిపి దీనికి రూ. 62 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటకలో రూ. 5.20 కోట్లు, తమిళనాడులో రూ. 2.50 కోట్లు, కేరళలో రూ. 1.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 88.40 కోట్ల బిజినెస్ జరిగింది.

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'లైగర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.00 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'లైగర్' మూవీకి ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 82 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 51 లక్షలతో.. రూ. 12.11 కోట్లు షేర్, రూ. 20.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
'లైగర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 12.11 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.05 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4.60 కోట్లు, మిగిలిన భాషల్లో రూ. 40 లక్షలు వచ్చాయి. వీటితో కలిపితే 3 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.26 కోట్లు షేర్, రూ. 42.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?
పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో వచ్చిన 'లైగర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 90 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 21.26 కోట్లు వచ్చాయి. అంటే మరో 68.74 కోట్లు వస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

ఇక్కడ దెబ్బ.. అక్కడ భారీగానే
భారీ అంచనాలతో రూపొందిన 'లైగర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ స్పందనే వస్తోంది. కానీ, హిందీలో మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మరీ ముఖ్యంగా మూడో రోజు ఆంధ్రా, తెలంగాణలో ఇది కేవలం రూ. 1 కోటి మాత్రమే వసూలు చేసింది. కానీ, నార్త్ ఇండియాలో మాత్రం ఏకంగా రూ. 4.50 కోట్ల నెట్ అంటే రూ. 2 కోట్లకు పైగానే షేర్‌ను రాబట్టింది.


Click it and Unblock the Notifications











