Liger Collections: సండే మరీ దారుణంగా.. ఆ మూవీ కంటే తక్కువ.. ఇంకెన్ని కోట్లు రావాలో తెలిస్తే!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. అదిరిపోయే యాక్టింగ్‌తో పాటు విలక్షణమన యాటిట్యూడ్‌తో ప్రత్యేకతను చాటుకుంటోన్న అతడు.. క్రమంగా తన మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంటూనే ఉన్నాడు. ఈ జోష్‌తోనే ఈ రౌడీ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ దేవరకొండ 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రానికి రెస్పాన్స్ క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో 'లైగర్' మూవీ 4 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

‘లైగర్‌’గా మారిపోయిన విజయ్

‘లైగర్‌’గా మారిపోయిన విజయ్


డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీనే 'లైగర్'. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ మూవీని ఛార్మీ, పూరీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. అలాగే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది.

లైగర్ మూవీ బిజినెస్ వివరాలు

లైగర్ మూవీ బిజినెస్ వివరాలు

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్'పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఆంధ్ర, తెలంగాణలో కలిపి దీనికి రూ. 62 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటకలో రూ. 5.20 కోట్లు, తమిళనాడులో రూ. 2.50 కోట్లు, కేరళలో రూ. 1.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ అయింది.

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది


'లైగర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 55 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది

4 రోజుల్లో 'లైగర్' మూవీకి ఏపీ, తెలంగాణలో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.70 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 98 లక్షలు, కృష్ణాలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ. 53 లక్షలతో.. రూ. 12.66 కోట్లు షేర్, రూ. 21.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


'లైగర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 12.66 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.30 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 6.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ. 75 లక్షలు వచ్చాయి. వీటితో కలిపితే 4 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.41 కోట్లు షేర్‌, రూ. 50.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?


పూరీ జగన్నాథ్ - అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 90 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 24.41 కోట్లు వచ్చాయి. అంటే మరో 65.59 కోట్లు వస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంటుంది.

ఆ మూవీ కంటే తక్కువ వసూళ్లు

ఆ మూవీ కంటే తక్కువ వసూళ్లు

ఎన్నో అంచనాలతో రూపొందిన 'లైగర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ స్పందనే వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ చిత్రం ఇక్కడ కేవలం రూ. 55 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అదే సీతా రామం మూవీ 24వ రోజైనా సరే ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 93 లక్షలు రాబట్టింది. దీనిబట్టి విజయ్ దేవరకొండ సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X