Liger 5 Days Collections: ఆచార్య తరువాత లైగర్.. ఆ రేంజ్‌లో నష్టాలు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఇటీవల భారీ స్థాయిలో ఫ్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరపైకి తీసుకురావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా కంటెంట్ విషయంలో మాత్రం తీవ్రంగా నిరాశపరచడంతో కలెక్షన్స్ రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇక వీకెండ్ తర్వాత సోమవారం నాటికి సినిమా కలెక్షన్లు మరింత డౌన్ అయ్యాయి. ఇక మొత్తంగా 5వ రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది? ఇంకా పెట్టిన పెట్టుబడికి ఎంత రావాలి అన్న వివరాల్లోకి వెళితే..

రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్

రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్


విజయ్ దేవరకొండ చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ కూడా టైగర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో మంచి బిజినెస్ డీల్స్ అయితే సెట్ అయ్యాయి. దీంతో ఆంధ్ర, తెలంగాణలో కలిపి దీనికి రూ. 62 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్నాటకలో రూ. 5.20 కోట్లు, తమిళనాడులో రూ. 2.50 కోట్లు, కేరళలో రూ. 1.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ చేసింది.

5వ రోజు నైజాం, ఆంధ్ర వసూళ్ళు

5వ రోజు నైజాం, ఆంధ్ర వసూళ్ళు

'లైగర్' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు వసూళ్లు మరింత దారుణంగా తగ్గాయి. మొదటిరోజు 9.57 కోట్లు అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రెండవ రోజు కేవలం 1.54 కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. ఇక మూడవరోజు కోటి రూపాయల షేర్, నాలుగో రోజు 58 లక్షల షేర్ రాగా 5వ రోజు మాత్రం మరింత దారుణంగా కేవలం 12 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.

5 రోజుల టోటల్ కలెక్షన్స్

5 రోజుల టోటల్ కలెక్షన్స్

5 రోజుల్లో 'లైగర్' సినిమా ఏపీ, తెలంగాణలో ఊహించని విధంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇక మొత్తంగా ఏరియాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 5.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 87 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ. 53 లక్షలతో.. రూ. 12.81 కోట్లు షేర్, రూ. 21.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

వరల్డ్ వైస్ కలెక్షన్స్

వరల్డ్ వైస్ కలెక్షన్స్


'లైగర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 12.81 కోట్లు షేర్ వచ్చింది. ఇక ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.47 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.34 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 6.75 కోట్లు, మిగిలిన భాషల్లో రూ. 77 లక్షల షేర్ వచ్చింది. మొత్తంగా 5 రోజుల్లో లైగర్ సినిమా వరల్డ్ వైడ్ రూ. 3.34 కోట్లు షేర్‌, రూ. 52.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

పెట్టిన పెట్టుబడికి ఇంకా ఎంత రావాలంటే?

పెట్టిన పెట్టుబడికి ఇంకా ఎంత రావాలంటే?

'లైగర్' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 90 కోట్లుగా నమోదైంది. ఇక 5 రోజుల్లో ఈ సినిమా రూ. 25.14 కోట్లు వచ్చాయి. ఇక నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంకా 68.86 కోట్లు రావాలి. కానీ సినిమా సోమవారం నాటికి మరింత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో భారీ నష్టాలు చూసే అవకాశం ఉంది.

ఆచార్య తరువాత..

ఆచార్య తరువాత..


లైగర్ కంటే మూడు వారాల ముందు వచ్చిన సీతారామం సినిమా సోమవారం ఎక్కువ కలెక్షన్స్ అందుకుంది. ఇక చూస్తుంటే లైగర్ ఆచార్య సినిమా తరువాత ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా సినిమా 30 కోట్ల షేర్ అందుకుంటుందా లేదా అనేది కూడా అనుమనంగానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X