Vikram Vs Thug Life: విక్రమ్‌కు 450 కోట్ల వసూళ్లు.. కమల్ థగ్ లైఫ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా?

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్, పాపులర్ డైరెక్టర్ కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న థగ్ లైఫ్ వివాదాల మధ్య రిలీజ్‌కు సిద్దమైంది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని ఆడియో రిలీజ్ వేడుకలో కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడ వాసుల మనోభావాలను దెబ్బ తీశాయి. దాంతో ఆయనను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సారీ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల కాకుండా నిషేధిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ క్రమంలో ఈ వివాదం బాగా ముదిరిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన నటించిన విక్రమ్ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకొన్న వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. విక్రమ్ సంచలన విజయం, కలెక్షన్ల మాదిరిగానే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే విక్రమ్ సినిమా కలెక్షన్లు, థగ్ లైఫ్ వసూళ్ల అంచనా వివరాల్లోకి వెళితే..

కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. దాంతో ఈ సినిమా సుమారుగా 450 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సినిమా తమిళనాడులోనే 185 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం ఓ రికార్డుగా మారింది.

Kamal Haasan s Thug Life beat Vikram s Box Office

'ఆ సూపర్‌స్టార్ తలుచుకొంటే కోటి మంది గర్ల్‌ ఫ్రెండ్స్.. వేల మంది అమ్మాయిలు ఆయన ఇంటి ముందు'

ఇక విక్రమ్ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఈ సినిమా తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేసిన బాక్సాఫీస్ జైత్రయాత్ర గురించిన వివరాల్లోకి వెళితే.. కేరళలో ఈ సినిమా 40 కోట్ల రూపాయలు, ఆంధ్రా, నైజాంలో కలిపి 40 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 27 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 125 కోట్ల రూపాయలు (16 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. కమల్ హాసన్ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లు సాధించింది.

ఇక థగ్ లైఫ్ సినిమాకు సంబంధించిన బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు కాగా, ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రికార్డు వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

థగ్ లైఫ్ అడ్వాన్స్ బుకింగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఇటీవల రిలీజైన రెట్రో, గుడ్ బ్యాడ్ అగ్లీ కంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బెటర్‌గా ఉన్నాయనే విషయం తాజాగా వెల్లడవుతున్న వసూళ్లతో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా తమిళనాడులో 4 కోట్లకుపైగా కలెక్షన్లను, ఇండియాలో 15 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా సుమారుగా 30 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.

అయితే కమల్ హాసన్ సొంత బ్యానర్‌పై నిర్మించిన థగ్ లైఫ్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విక్రమ్ సాధించిన వసూళ్లను అధిగమిస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు ట్రేడ్, ప్రేక్షక వర్గాలను వెంటాడుతున్నది. కొద్ది రోజులు ఆగితే థగ్ లైఫ్ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందనే విషయంపై స్పష్టత వస్తుంది అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Read more about: kamal haasan thug life vikram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X