పది నిమిషాలకు రూ. 5 కోట్లు ఖర్చు.. విజయ్ దేవరకొండ రేంజ్ మామూలుగా లేదుగా.!

By Manoj

తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈ కుర్రాడు.. 'పెళ్లి చూపులు'తో హీరోగా మారాడు. మొదటి సినిమాలోనే చక్కని నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక, 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి హిట్లతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే అతడి రేంజ్ కూడా పెరిగిపోయింది. తాజాగా విజయ్‌కు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ సంగతులేంటో ఓ లుక్కేయండి.!

క్రేజీ హీరోకు అలాంటి డైరెక్టరే దొరికాడు.. ఎలా ఉంటాడో

క్రేజీ హీరోకు అలాంటి డైరెక్టరే దొరికాడు.. ఎలా ఉంటాడో


విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అని వార్త బయటకు రాగానే.. అప్పుడే దానిపై అంచనాలు పెరిగిపోయాయి. తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్‌గా చూపించే పూరీ.. ఇందులో విజయ్‌ను ఎలా చూపించబోతున్నాడో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

ఆయన చూశాడు.. ఇండియా మొత్తం చూపిస్తున్నాడు

ఆయన చూశాడు.. ఇండియా మొత్తం చూపిస్తున్నాడు


ఈ సినిమాను మొదట పూరీ జగన్నాథ్, చార్మీ భాగస్వామ్యంలో నిర్మించాలని అనుకున్నారు. అయితే, ఈ సినిమా స్క్రిప్ట్ చూసిన తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా చేరారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్‌కు మారింది. దీంతో ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు.

ఎంతో మంది అమ్మాయిలు.. ఎవరూ సెట్ అవలేదు

ఎంతో మంది అమ్మాయిలు.. ఎవరూ సెట్ అవలేదు

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇందుకోసం కియారా అద్వాణీ, జాన్వీ కపూర్ సహా ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే, ఆలియా భట్, అనన్య పాండే పేర్లను పరిశీలించారు. కానీ, ఎవరినీ ఫైనల్ చేయలేదని అంటున్నారు. దీంతో ఇది చిత్ర యూనిట్‌కు పెద్ద టాస్క్ అయింది.

ముందు అనుకున్నది మారింది.. ఇదేంటో కొత్తగా

ముందు అనుకున్నది మారింది.. ఇదేంటో కొత్తగా


మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ‘ఫైటర్' అనే టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించాడు పూరీ జగన్నాథ్. అయితే, ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీగా మారడంతో టైటిల్ కూడా మారుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీకి ‘లైగర్' అనే పేరు ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ కొత్తగా ఉండడంతో చర్చనీయాంశం అవుతోంది.

పది నిమిషాలకు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు

పది నిమిషాలకు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమాలో వచ్చే పది నిమిషాల సీన్ కోసం అక్కడ రూ. 5 కోట్లతో సెట్ వేశారట. విజయ్ జాయిన్ అయిన వెంటనే ఆ సెట్‌లో షూటింగ్ మొదలు పెడతారనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Vijay Deverakonda,Deepika Padukone Spotted @ Mumbai Airport
ఒకేసారి నలుగురు అమ్మాయిలతో ప్రేమాయణం

ఒకేసారి నలుగురు అమ్మాయిలతో ప్రేమాయణం


విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. ఇందులో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X