వరుస పూరీలు: జన గణ మన తర్వాత ఎన్టీఆర్ తో ‘నేతాజీ’?
హైదరాబాద్: గ్యాపు లేకుండా సినిమాలు చేసే పూరి జగన్నాధ్ జ్యోతిలక్ష్మి, లోఫర్ ప్లాపైన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇట్టా అయితే లాభం లేదని పెద్ద హీరోలతోనే చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రేక్షకులకు వరుస వడ్డింపులకు సిద్ధమవుతున్నారు.
ఇటీవలే పూరి తన సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుతో 'జన గణ మన' సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఎన్టీఆర్ హీరోగా 'నేతాజీ' అనే సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అంతే కాకుండా వెంకటేష్ 75వ సినిమాకు కూడా పూరినే దర్శకత్వం వహించబోతున్నారు. కళ్యాణ్ హీరోగటా కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఇంతకాలం పూరి గ్యాప్ తీసుకోవడానికి కారణంగా ఈ సినిమాలకు సంబంధించిన స్క్రీప్టు వర్కు మీ ఫోకస్ పెట్టడమే అంటున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన స్క్రిప్టులు పక్కాగా సిద్దం చేసుకున్న తర్వాత షూటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.
ఇవన్నీ ఒకే గానీ.... ఎన్టీఆర్ తో చేసే 'నేతాజీ' సినిమా విషయంలోనే ఇంకా ఓ క్లారిటీ అంటూ రావడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉందని, ఎన్టీఆర్ నుండి గ్రీన్ సింగ్నల్ వచ్చిన తర్వాత అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











