విజయ్ దేవరకొండ ఔట్.. ఆనంద్ దేవరకొండ ఇన్.. నాగవంశీ మాస్టర్ ప్లాన్?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల చుట్టూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రణబలి' రిలీజ్ రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తుండగా.. మరోవైపు అదే డేట్‌ను ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'ఎపిక్' కోసం నిర్మాత నాగవంశీ వినియోగించుకునే ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. భారీ సినిమా వాయిదాతో ఖాళీ అయ్యే గోల్డెన్ రిలీజ్ స్లాట్‌ను యూత్ లవ్ ఎంటర్‌టైనర్‌కు దక్కేలా చేసే నాగవంశీ మాస్టర్ స్ట్రాటజీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగింది?

Also Read
Lenin 13 Days Box Office: లెనిన్ అరుదైన బాక్సాఫీస్ రికార్డు..అఖిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Lenin 13 Days Box Office: లెనిన్ అరుదైన బాక్సాఫీస్ రికార్డు..అఖిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

'రణబలి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. వివాహం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. బ్రిటిష్ పాలనలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన పోరాటాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతోందని ఉండబోతుంది.

Anand Deverakonda Epic Release Eyes Ranabali Date as Vijay Deverakonda Film Gets Delayed
Recommended For You
అదే మీరు నాకు ఇచ్చే నిజమైన బహుమతి.. చిరంజీవి ఎమోషనల్!
అదే మీరు నాకు ఇచ్చే నిజమైన బహుమతి.. చిరంజీవి ఎమోషనల్!

అయితే ఇలాంటి భారీ చిత్రాలకు షూటింగ్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరం అవుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి 'రణబలి'కి ఎదురైనట్లు తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌లో కూడా సెప్టెంబర్ 11 విడుదల తేదీని ప్రస్తావించకపోవడం ఈ వాయిదా పడుతుందనే ప్రచారం మొదలవుతోంది. దీంతో త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

You May Also Like
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!

ఈ నేపథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న 'ఎపిక్' సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. 'ఎపిక్' సినిమాకు దర్శకుడు ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నారు. '90's'వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈసారి యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, ప్రేమ, వినోదం మేళవింపుతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.

హీరో జయకృష్ణకు మహేష్ బాబు క్లాస్.. ఇండస్ట్రీ ఎంట్రీకి ముందు అలా..
హీరో జయకృష్ణకు మహేష్ బాబు క్లాస్.. ఇండస్ట్రీ ఎంట్రీకి ముందు అలా..

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటపై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన 'బేబీ' భారీ విజయాన్ని అందుకోవడంతో, మరోసారి ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే 'ఎపిక్' ప్రకటించినప్పటి నుంచే యూత్‌లో మంచి బజ్ ఏర్పడింది. వాస్తవానికి 'ఎపిక్' చాలా ముందే విడుదల కావాల్సి ఉంది. మొదట మార్చి నెలను లక్ష్యంగా పెట్టుకున్నారు.

తర్వాత జూలైలో విడుదల చేయాలని భావించింది. కానీ వివిధ కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టులో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు ఉండటంతో సెప్టెంబర్ స్లాట్‌ను ఎంచుకున్నారనే ప్రచారం వినిపిస్తోంది. 'రణబలి' విడుదల వాయిదా పడితే సెప్టెంబర్ 11 తేదీ దాదాపు ఖాళీ అవుతుంది. ఆ స్టాట్ లో 'ఎపిక్'కు విడుదల చేయాలన భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై చిత్రబృందాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 'రణబలి' నిజంగానే వాయిదా పడుతుందా? 'ఎపిక్' సెప్టెంబర్ 11కే వస్తుందా? అనే అంశాలపై పూర్తి స్పష్టత రావాలి. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X