విజయ్ దేవరకొండ ‘ఫైటర్’కు భారీ షాక్: షూటింగ్ ప్రారంభమైన వెంటనే ఊహించని పరిణామం.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోగా పేరు దక్కించుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. కొన్ని సినిమాలే చేసినప్పటికీ భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మరోవైపు, తనకంటూ ప్రత్యేకమైన శైలితో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్‌గా పేరొందాడు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. అలాంటి ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమానే 'ఫైటర్'. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దిట్టగా పేరొందిన పూరీ తెరకెక్కించే ఈ మూవీలో విజయ్ ఎలా కనిపిస్తాడన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది. ఇంతకీ ఏంటా షాక్.? వివరాల్లోకి వెళితే....

విజయ్ యాటిట్యూడ్‌లో కొత్త యాంగిల్

విజయ్ యాటిట్యూడ్‌లో కొత్త యాంగిల్

విజయ్ దేవరకొండకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అతడిని చూస్తే ఆ విషయం అర్థం అవుతోంది. అయితే, ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మాత్రం అతడి మేనరిజం సరికొత్తగా ఉంటుందట. ఇందుకోసం బడా డైరెక్టర్ మాస్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక్కడే అనుకుంటే అక్కడకు పాకింది

ఇక్కడే అనుకుంటే అక్కడకు పాకింది

మొదట ‘ఫైటర్'ను తెలుగులోనే తెరకెక్కించాలని అనుకున్నారు. ఇందుకోసం పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్‌పై, ఛార్మీతో కలిసి దీన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కొద్ది రోజుల కిందట ఈ సినిమా స్క్రిప్టు విన్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. దీన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని పూరీకి సలహా ఇచ్చాడట. అలాగే, దీనికి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.

పదిహేను మందితో పోరాడుతున్నాడు

పదిహేను మందితో పోరాడుతున్నాడు

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో అతడు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తిగా కనిపించబోతున్నాడట. అందుకోసం కొద్ది రోజులుగా విజయ్.. థాయ్‌లాండ్‌కు చెందిన పదిహేను మంది ఫైటర్ల నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో మెళకువలు నేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

భారీ రేటుకు ఆమెను ఫిక్స్ చేసేశారు

భారీ రేటుకు ఆమెను ఫిక్స్ చేసేశారు

‘ఫైటర్'లో విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేశారని అన్నారు. అంతేకాదు, ఇందుకోసం రూ. 3.5కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది.

విజయ్ దేవరకొండ ‘ఫైటర్’కు భారీ షాక్

విజయ్ దేవరకొండ ‘ఫైటర్’కు భారీ షాక్

ఈ సినిమా షూటింగ్ జనవరి 20న ముంబైలో ప్రారంభం అయింది. అలా షూటింగ్ మొదలైందో లేదో.. ఈ చిత్ర యూనిట్‌కు షాక్ తగిలినట్లు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ తప్పుకుందట. ప్రస్తుతం ఆమె చాలా సినిమాల్లో నటిస్తుండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం కారణంగానే జాన్వీ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

వెంటనే సెట్ చేసేసిన కరణ్ జోహార్

వెంటనే సెట్ చేసేసిన కరణ్ జోహార్

‘ఫైటర్' నుంచి జాన్వీ కపూర్ తప్పుకోవడంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ అదిరిపోయే ప్లాన్ చేశారట. ఆమె స్థానాన్ని అనన్య పాండేతో భర్తీ చేయాలని పూరీకి చెప్పినట్లు తెలుస్తోంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం అయిన అనన్య.. ఈ మధ్య కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన ‘పతీపత్నీ ఔర్‌ ఓ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X