విజయ్ దేవరకొండ క్రేజ్: బాలీవుడ్ బ్యూటీతో ఫైటింగ్‌కు దిగుతున్న మరో హీరోయిన్

By Manoj

చేసింది తక్కువ సినిమాలే అయినా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకూ తనలోని వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోనే బడా డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్‌తో 'ఫైటర్' అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆ మార్క్ మిస్ కాకుండా ప్లాన్

ఆ మార్క్ మిస్ కాకుండా ప్లాన్

పూరీ జగన్నాథ్ సినిమాలు మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేవిగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ అదే తరహాలో వచ్చాయి. ఇక, ఇటీవల కొద్ది రోజుల క్రితం విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘ఇస్మార్ట్ శంకర్' కూడా మాస్ మూవీగానే వచ్చింది. ఇప్పుడు విజయ్‌తో తెరకెక్కించే సినిమా కూడా అదే జోనర్‌లో ఉంటుందని అంటున్నారు.

 సొంతంగా చేద్దామనుకుంటే ఆయన కలిశాడు

సొంతంగా చేద్దామనుకుంటే ఆయన కలిశాడు

విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాను స్వయంగా నిర్మిస్తానని పూరీ జగన్నాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఈ స్క్రిప్ట్ విన్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. దీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆయన కూడా పెట్టుబడి పెట్టనున్నారు. దీంతో మూవీ చాలా భాషల్లో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

ఒక్కరు కాదు.. ఎంతో మంది పేర్లు వచ్చాయి

ఒక్కరు కాదు.. ఎంతో మంది పేర్లు వచ్చాయి

పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని కొందరు అంటుండగా.. పలానా నటుడు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.

మామూలు వాళ్లు కాదు.. అందరూ ప్రముఖులే

మామూలు వాళ్లు కాదు.. అందరూ ప్రముఖులే

ఈ సినిమాలో సాధాసీదా నటీనటులు ఉండరని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆమెకు రూ. 3.50 కోట్లు చెల్లించనున్నారు. అలాగే, విలన్‌గా తెలుగు హీరో కార్తికేయను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే, విజయ్ తల్లి పాత్రకు రమ్యకృష్ణను ఫైనల్ చేశారని అంటున్నారు.

బాలీవుడ్ బ్యూటీతో మరో హీరోయిన్ ఫైటింగ్

బాలీవుడ్ బ్యూటీతో మరో హీరోయిన్ ఫైటింగ్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమై విషయం బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో జాన్వీ కపూర్‌తో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. విజయ్ దేవరకొండతో ప్రేమ కోసం జాన్వీతో ఆమె ఫైటింగ్ చేస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పూరీ జగన్నాథ్ ఇలా డిసైడ్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X