NBK109: సెన్సేషనల్ డైరెక్టర్‌తో బాలయ్య.. చెన్నకేశవరెడ్డి తరహాలో.. డిజాస్టర్ తర్వాత మరో ప్రయోగం
గతంలో కంటే ఈ మధ్య కాలంలో యమ స్పీడుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు వరుసగా హిట్లను కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో మరిన్ని ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతోన్నారు. ఇలా ఇప్పటికే పలు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించేశారు. ఈ క్రమంలోనే బాలయ్య ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు కూడా చూసేయండి మరి!

అఖండమైన హిట్‌తో దూకుడు
ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడుతోన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రంతో కెరీర్‌లోనే బిగ్ సక్సెస్‌ను అందుకున్నారు.

వీర సింహా రెడ్డిగా మరో సక్సెస్
'అఖండ' తర్వాత నటసింహా బాలకృష్ణ మరింత ఉత్సాహంతో దూసుకెళ్తోన్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేనితో 'వీర సింహా రెడ్డి' అనే సినిమాను చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుదలైంది. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లతో భారీ విజయాన్ని దక్కించుకుంది.

అనిల్ రావిపూడితో మూవీ స్టార్ట్
'వీర సింహా రెడ్డి' పట్టాలపై ఉన్న సమయంలోనే బాలయ్య.. అనిల్ రావిపూడితో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రాజెక్టును చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీనికి 'రామారావు గారు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఆ దర్శకులందరూ లైన్‌లోనే
'అఖండ' హిట్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ స్పీడు పెంచేశారని చెప్పొచ్చు. ఇప్పటికే అనిల్ రావిపూడితో సినిమా చేస్తోన్న ఆయన.. పలువురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో పరశురాం పెట్ల, ప్రశాంత్ వర్మ, మల్లిడి వశిష్ట, బోయపాటి శ్రీను, బాబీలు ఉన్నారు. అలాగే, హరీశ్ శంకర్‌తోనూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది.

పూరీ జగన్నాథ్‌తోనే బాలకృష్ణ
ఇప్పటికే ఎంతో మంది దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటసింహా నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మరింత సమాచారం లీకైంది. దీని ప్రకారం.. బాలయ్య.. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో భారీ ప్రాజెక్టును చేయబోతున్నారని తెలిసింది.

పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్
నటసింహా నందమూరి బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ చేయబోయే సినిమాను పూరీ సొంత బ్యానర్‌లోనే నిర్మించబోతున్నాడని కూడా తెలిసింది. 'లైగర్' నష్టాల నుంచి బయట పడేందుకు ఇప్పుడు తక్కువ బడ్జెట్‌తోనే సినిమా పూర్తయ్యేలా పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లోనే తీసుకు రావాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.

చెన్నకేశవరెడ్డి తరహా స్టోరీతో
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించే సినిమా తండ్రీ కొడుకుల ఇగోతో కూడిన కథతో రూపొందనుందని తాజాగా తెలిసింది. ఒక రకంగా ఇది 'చెన్నకేశవరెడ్డి' మూవీని పోలినట్లు ఉంటుందని సమాచారం. ఇందులో పూరీ మార్క్ మాస్ ట్రీట్ కూడా పెట్టబోతున్నారని తెలుస్తోంది. గతంలో వీళ్ల కాంబోలో 'పైసా వసూల్' వచ్చి ఫ్లాపైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











