Balayya: ఈ విషయం తెలిస్తే.. ఫ్యాన్సే కాదు.. అందరూ జై బాలయ్య అంటర్రా అబ్బాయిలు
బాలయ్య.. ఈ పేరులోనే ఓ క్రేజ్.. ఓ ఊపు ఉంటుంది. సిచ్యూవేషన్ కు సంబంధం లేకుండా మన నోట వచ్చే డైలాగ్ జై బాలయ్య. అంతటి క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణ.. మరింత జోష్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్య గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఇక ఈ న్యూస్ వింటే.. బాలయ్య ఫ్యాన్స్.. నిజంగా మా బాలయ్య రియల్ హీరో అంటారు. ఇక మిగతా హీరోల ఫ్యాన్స్ సైతం మెచ్చుకోవాల్సిందే. అంతలా బాలయ్య చేసిన మంచి పని ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే...
అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం.. మరి బాలయ్య ఫ్యాన్స్ ప్రేమకు మాత్రం హద్దులు ఉండవు. ఇక బాలకృష్ణ సైతం.. పైకి ఉగ్ర నరసింహుడిలా కనిపించినా.. లోపల మాత్రం ఆయన మనసు వెన్న. గత ఏడాది వచ్చిన అన్ స్టాపబుల్ షోతో.. ఆయన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. ఒకప్పుడు బాలయ్య అంటే కోపిస్టి.. అని అనుకునే వారు. కానీ ఆ షోతో ఆయనపై ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బాలయ్య అంటే ఓ భోళా శంకరుడు అని అర్థం అయింది.

ఇదిలా ఉంటే.. బాలయ్య వరుస సినిమాలతో జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. అఖండతో స్టార్ట్ అయిన ఆయన సక్సెస్ జర్నీ.. అన్ స్టాపబుల్ సీజన్స్, వీర సింహరెడ్డి సినిమా వరకు కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబుకు ఫస్ట్ టైం జోడీగా కాజల్ నటిస్తోంది. కూతరి పాత్రలో శ్రీలీల నటిస్తుందని ప్రచారం సాగుతోంది.
అయితే బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య క్రేజ్.. తన తోటి హీరోల క్రేజ్ తో సమానంగా ఉంది. అంతే కాదు.. ఆయన సినిమా సక్సెస్ రేటు బానే ఉంది. మార్కెట్ లో బాలయ్య క్రేజ్ కూడా బాగానే ఉంది. అయినప్పటికీ బాలయ్య రెమ్యూనరేషన్ చాలా తక్కువగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ ఒక్క సినిమాకు కేవలం 20 నుంచి 25 కోట్ల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకుంటున్నరట. మిగతా హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్నప్పటికీ.. బాలయ్య నిర్మాతల పరిస్థితి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్... మా హీరో నిజంగా తోపు అని కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య కేవలం సినిమాకి, అభిమానులకు హీరో మాత్రమే కాదు.. నిర్మాతల హీరో అని చెబుతున్నారు. అలా బాలయ్య నిర్మాతల పాలిట హీరోగా అవతరించారు.
Balakrishna: బాబీకి బాలయ్య షాక్ అంటూ ప్రచారం.. అసలు సంగతి ఏంటంటే?
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం భగవంత్ కేసరి షూటింగ్ దశలో ఉంది. ఇక అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రానుంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ పిరియాడిక్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దీనికి డైరెక్షన్ చేస్తారన్ టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











