హీరోలు దొరక్క పీకల్లోతూ కష్టాల్లో ఉన్న దర్శకుడితో బాలయ్య కొత్త సినిమా.. వర్కౌట్ అవుతుందా?
నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన చేసిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ ఒక డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
అది సార్ బాలయ్య అంటే...: ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన తర్వాత తనకు బాగా కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. ఇంకా కరోనా నుంచి అందరూ కోలుకొని నేపథ్యంలో సినిమా విడుదల చేస్తే నష్టాలతో ఇబ్బంది పడతామేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో అఖండ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ.

భగవంత్ కేసరిగా బాలయ్య...: ఆ తరువాత ఆయన చేసిన అన్ స్టాపబుల్ అనే షో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకు ముందు వరకు బాలకృష్ణ మీద ఉన్న అంచనాలన్నీ ఆ షోతో మారిపోయాయి. బాలకృష్ణ భోళా శంకరుడు అని ఎలాంటి కల్మషం లేని వ్యక్తిని అందరూ భావిస్తూ వచ్చారు. అలా ఆయన చేసిన వీర సింహారెడ్డి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ప్రస్తుతానికి ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు.

నెక్ట్స్ బాబీతో సినిమా...: నేలకొండ భగవంత్ కేసరి అనే వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కాజల్ అగర్వాల్ కుమార్తెగా శ్రీ లీల నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోపక్క వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక సినిమా ఫైనల్ చేసి అధికారికంగా కూడా ప్రకటించారు.

డిజాస్టర్ డైరెక్టర్కు ఛాన్స్...: అయితే ఈ సినిమా తర్వాత ప్రస్తుతం డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న ఒక దర్శకుడికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ అనే సినిమా చేసి భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు పూరి జగన్నాథ్. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆయనతో చేస్తున్న ప్రాజెక్టు నుంచి తప్పుకోవడమే కాదు... ఏ హీరో కూడా ఆయనకి డేట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది.

వర్కౌట్ అవుతుందా...:ఇలాంటి సమయంలో రామ్ ధైర్యం చేసి పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇక ఇలాంటి తరుణంలో బాలకృష్ణ కూడా పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి పైసా వసూల్ అనే ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ చేశారు. ఆ సినిమా వర్కౌట్ అవ్వకపోయినా పూరీ జగన్నాథ్ పరిస్థితి అర్థం చేసుకున్న బాలయ్య ఆయనకు ఈ మేరకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











