విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా.. బాలీవుడ్ హీరో పవర్ఫుల్ రోల్?

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి విజయ్, పూరి పాన్ ఇండియా సినిమాతో సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఫైటర్ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఒక పవర్ఫుల్ సపోర్టింగ్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో సౌత్ లో సునీల్ శెట్టి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే కన్నడలో సుజిత్ పహిల్వాన్ లో నటించిన సునీల్ కోలీవుడ్ లో కూడా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Bollywood senior hero special role in vijay devarakonda pan india project

మెయిన్ గా పాన్ ఇండియా సినిమాల్లో మంచి పాత్ర లభిస్తే రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా ఓకే చేస్తున్నట్లు టాక్. ఇక ఫైనల్ గా విజయ్ దేవరకొండ సినిమాలో కూడా పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఫైటర్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని ముంబైలో ప్లాన్ చేసిన పూరీ వీలైనంత త్వరగా అక్కడ షూటింగ్ ని పూర్తి చేసి మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే స్టార్ట్ చేయనున్నారట. ఇక సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X