యంగ్ హీరోపై ఛార్మి ఫోకస్.. పూరి హెల్ప్‌తో ఇలా ప్లాన్ చేస్తోందట!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతోందట హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్. ఇకపై ఆ హీరో వెంటే ఉండి ఆయన లుక్ మార్చేయాలని భావిస్తోందట. ఈ న్యూస్ ఫిలింనగర్‌లో హాట్ ఇష్యూగా మారింది. ఇంతకీ విజయ్ దేవరకొండపై ఛార్మి ఇంట్రెస్ట్ ఇందుకోసం? వివరాల్లోకి పోతే..

విజయ్ దేవరకొండ బిజీ బిజీ..
విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తికాగానే ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'ఫైటర్' అనే పేరు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పూరి జగన్నాథ్‌తో పాటు ఛార్మి కూడా..
ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్‌లో తీయాలనే ఆలోచనతో ఉన్నారు పూరి జగన్నాథ్. ఎప్పటిలాగే పూరి జగన్నాథ్‌తో పాటు ఛార్మి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుంది. కరణ్ జోహార్‌ను నిర్మాణ భాగస్వామిగా తీసుకున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండను సరికొత్తగా చూపించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఫిక్స్ అయిన ఛార్మి.. గతంలో ఎన్నడూ లేనివిధంగా
ఫైటర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ మేకోవర్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే బాధ్యతను తీసుకుందట ఛార్మి. విజయ్ స్టైల్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ మార్చేసేలా చార్మీ ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సహకారం కూడా తీసుకుంటోందట. గతంలో ఎన్నడూ చూడని విధంగా విజయ్‌ని చూపించాలని ఫిక్స్ అయిందట ఛార్మి.

విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మొదలుకొని అన్నీ..
ఈ మేరకు భారతదేశ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీమ్ చేత విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ మార్చేయనుందట ఛార్మి. చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మొదలుకొని లుక్ వరకు అన్ని బాధ్యతలు ఛార్మినే తీసుకొని స్వయంగా పర్యవేక్షించనుందట.

విజయ్ దేవరకొండతో హీరోయిన్
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చిన పూరి.. బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బెటర్ అని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఆ విషయాన్ని కరణ్ జొహార్‌కి చెప్పి ఆ భాధ్యతను అతనికే అప్పగించాడట పూరి. కాగా జాన్వీ కపూర్, సారా అలీఖాన్, ఆలియా భట్ పేర్లు పరిశీలించిన కరణ్.. ఆలియా భట్ వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. అతిత్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.


Click it and Unblock the Notifications











