పూరీతో సినిమా.. రామ్ ఒప్పుకోడానికి కారణం ఆమెనట..!

Recommended Video

The Real Reason Behind Ismart Shankar Movie Project | Ram Pothineni | Nidhi Agerwal | Filmibeat

తెలుగు సినీ ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ పెరిగిపోతున్న అంచనాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు.

ఫ్లాప్‌లతో సతమతం

ఫ్లాప్‌లతో సతమతం

అటు డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఇటు హీరో రామ్ ఇద్దరూ కొద్దిరోజులుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నారు. రామ్ ఈ మధ్య కొన్ని సినిమాలతో పర్వాలేదనిపించినా.. భారీ హిట్ మాత్రం అతడికి అందని ద్రాక్షాలనే తయారైంది. ఇక, పూరీ విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన ‘టెంపర్' తర్వాత ఆయనకు హిట్ అంటేనే తెలియని పరిస్థితి ఉంది. ఈ మధ్య ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ అన్నీ విఫలమయ్యాయి.

 కుదిరిన జోడీ

కుదిరిన జోడీ

సరైన సక్సెస్‌లు లేక బాధ పడుతున్న రామ్, పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్' ద్వారా కలిశారు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే కసితో పని చేశారు. అందుకోసం పూరీ సరికొత్త కథను సిద్ధం చేశానని చెబుతున్నారు. మరోవైపు, రామ్ కూడా ఈ సినిమా కోసం కొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌తో పాటు తెలంగాణ యాసను ట్రై చేశాడు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కాంబినేషన్ కుదిర్చింది ఛార్మీనేనట

కాంబినేషన్ కుదిర్చింది ఛార్మీనేనట

ప్రస్తుత పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్‌కు డేట్స్ ఇవ్వడానికి ఏ హీరోనూ ముందుకు రావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ అతడితో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడంటే దానికి కారణం ఛార్మీనే అని తెలుస్తోంది. కొద్దిరోజులుగా పూరీతో కలిసి ట్రావెల్ చేస్తున్న ఆమె.. రామ్ డేట్స్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించిందట. అంతేకాదు, ఈ స్టోరీ లైన్ కూడా ఛార్మీనే రామ్‌కు వినిపించిందని కూడా తెలిసింది. మొత్తానికి ఎలాగోలా ఈ యంగ్ హీరోను ఒప్పించిందట ఈ సీనియర్ హీరోయిన్.

 నిర్మాతగానూ వ్యవహరిస్తోంది

నిర్మాతగానూ వ్యవహరిస్తోంది

ఈ సినిమాకు ఛార్మీ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న ఛార్మీ.. దీని కోసం ఎంతో కష్టపడింది. ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ వచ్చింది. ఆమె గతంలోనూ పూరీ తనయుడు ఆకాశ్ హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా'కూ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

‘ఇస్మార్ట్ శంకర్' ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీ స్థాయిలో జరిగిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లు అని, థియేట్రికల్ రైట్స్‌తో కలుపుకుని ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ. 36.18 కోట్లు అని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. రామ్ సినిమాకు ఈ మేర బిజినెస్ అవడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X