ఛార్మికి చుక్కలు.. లెక్క బాగానే తేలిందట! ఇష్యూ హాట్ టాపిక్
సినీ నటి, నిర్మాత ఛార్మికి ఓ విషయంలో చుక్కలు చూపిస్తున్నారట కొందరు వ్యక్తులు. అది కూడా డబ్బు వ్యవహారంలో. ఛార్మికి రావాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఛార్మికి వచ్చిన చిక్కు ఏంటి? ఆ డబ్బు ఇవ్వాల్సింది ఎవరు? ఆ వివరాలు చూస్తే..

ఛార్మి నిర్మాతగా ఇస్మార్ట్ శంకర్
డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి గత కొంతకాలంగా సినిమా నిర్మాణాల్లో భాగమవుతూ వస్తున్న ఛార్మి.. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఫైనాన్సియల్ వ్యవహారాలన్నీ ఛార్మియే హ్యాండిల్ చేసింది.

ఎలాగైనా మంచి మార్కెట్ రావాలని ఛార్మి
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న పూరి జగన్నాథ్‌కి మంచి బ్రేక్ తీసుకురావాలనే కోణంలో ఛార్మి సరికొత్తగా ఆలోచిస్తూ మార్కెట్ చేసింది.
ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ మొదలుకొని బయ్యర్స్, సినిమా కొనుగోళ్ల వ్యవహారాల్లో ముందడుగు వేసింది. ఎలాగైనా మంచి మార్కెట్ రావాలని బయ్యర్లు తక్కువ ఇస్తామన్నా చార్మీ ఓకే అనేసిందట. విడుదలయ్యాక మిగితా వ్యవహారం ఆలోచిద్దాం అనుకుందట.

ఇస్మార్ట్ సూపర్ హిట్.. ఇప్పుడు కష్టాలు
తీరా ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలయ్యాక సూపర్ డూపర్ హిట్ సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో 'ఇస్మార్ట్ శంకర్' కొనుగోలు వ్యవహారం ఛార్మికి ఇప్పుడు కష్టాలు తెచ్చిపెడుతోంది, లేని తలనొప్పిగా మారిందని కథనాలు వెలువడుతున్నాయి. బయ్యర్లకు డబుల్ లాభాలు వచ్చినా ఛార్మికి రావాల్సిన మొత్తం రావడం లేదని తెలుస్తోంది.

కోట్లలో ఉంది.. ఆ సంగతేంటో!
అయితే బయ్యర్లందరూ అలా లేరని, కొందరు సిన్సియర్‌గా ఇవ్వాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం ఛార్మికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారట. అలా రావలసిన మొత్తం కోట్లలో ఉందని అంటున్నారు. దీంతో ఈ హాట్ టాపిక్‌గా మారింది.

ఇస్మార్ట్ శంకర్ మూవీ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ సక్సెస్ సాధించింది. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విజయం చిత్రయూనిట్ మొత్తానికి మంచి అవకాశాలు తెచ్చిపెడుతోంది.


Click it and Unblock the Notifications











