పూరీని వదులుకున్న రామ్‌కు కోలుకోలేని షాక్.. నమ్ముకున్న డైరెక్టర్ చేతులెత్తేశాడట.!

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఫలితంలో మాంచి ఖుషీ మీద ఉన్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. గతంలో కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ, ఈ రేంజ్ హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. వాస్తవానికి అందుకు తగ్గట్లే రామ్ ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మార్పులు చేసుకున్నాడు. దీంతో సక్సెస్ అయ్యాడు. అయితే, రామ్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అతడికి కోలుకోలేని షాక్ తగిలిందట. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆ సీక్వెల్‌లో నటిస్తాడని ప్రకటన

ఆ సీక్వెల్‌లో నటిస్తాడని ప్రకటన

కొద్దిరోజుల క్రితం తన తదుపరి సినిమా గురించి పూరీ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది. ఎక్కడకు వెళ్లినా ‘ఇస్మార్ట్ శంకర్ 2' ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ సినిమా సీక్వెల్ తీయాల్సిన పరిస్థితి వస్తుందని మేము ముందే ఊహించాం. అందుకే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి, సీక్వెల్‌ను ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. ఇందుకోసం ‘డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టాను'' అని ఆయన చెప్పుకొచ్చాడు.

అలాంటి సినిమాలు చేయడట

అలాంటి సినిమాలు చేయడట

ఇస్మార్ట్ శంకర్ సినిమా పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ మరో మాస్ సినిమా చేయడానికి సిద్ధంగా లేడన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం అతడిపై మాస్ హీరో అనే ముద్ర పడకూడదనేనట. వరుసగా రెండు సినిమాలు చేస్తే ఆ ప్రమాదం ఉండడంతో, కొన్ని ఫ్యామిలీ, లవ్ బేస్‌డ్ మూవీస్ చేసి ఆ తర్వాత ఈ సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడని టాక్.

 కిశోర్ తిరుమలతో సినిమా

కిశోర్ తిరుమలతో సినిమా

తనకు ‘నేను శైలజ' వంటి సక్సెస్‌ను ఇచ్చిన కిశోర్ తిరుమలతో సినిమాను ప్రారంభించబోతున్నాడు రామ్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో అధికారికంగా ప్రారంభం కానుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సినిమా ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన నివేదా థామస్ నటిస్తోంది.

 నిర్ణయం మార్చుకున్న రామ్

నిర్ణయం మార్చుకున్న రామ్

మాస్ సినిమాలు చేయకూడదన్న ఉద్దేశ్యంతో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామా చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నాయి. కానీ, ఈ సినిమా స్టార్ట్ కాలేదు. దీనికి కారణం ఈ సినిమా కథకు మాస్ టచ్ ఇవ్వమని దర్శకుడికి రామ్ సూచించడమేనని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

చేతులెత్తేశాడు

చేతులెత్తేశాడు

రామ్ సూచన మేరకు స్క్రిప్టులో మార్పులు చేసి మాస్ కథను తయారు చేశాడట కిశోర్ తిరుమల. అయితే, ఈ కథ రామ్‌కు నచ్చలేదని తాజాగా మరో వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఫ్యామిలీ సినిమాలే చేసిన కిశోర్.. మాస్ కథలు తన వల్ల కాదని రామ్‌కు తేల్చి చెప్పేశాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక రామ్ తల పట్టుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X