26 ఏళ్లకే పెళ్లికి రెడీ అయిన కుర్ర హీరో... పొలిటికల్ లీడర్ కూతురితో త్వరలోనే!

ఇండస్ట్రీలో మరో డైరెక్టర్ ఇంట పెళ్లి బాజాలు మొగనున్నాయి. మొన్నటి వరకు మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి కాగా... ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట కూడా పెళ్లి బాజాలు మొగనున్నాయట. ఆయన తనయుడు ఆకాష్ పూరీ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నట్లు నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది. 26ఏళ్లకే పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన ఈ కుర్ర హీరో.. త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నట్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మొగుతున్నాయి. అందరూ ఓ ఇంటివారు అవుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉండే వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి హీరోలు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. ఇక సీరియల్ హీరో మానస్.. కూడా ఇటీవల పెళ్లి పీటలెక్కాడు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కుర్ర హీరోకి 26 ఏళ్లు కూడా నిండలేదు.. అప్పుడే పెళ్లికి సిద్ధం అయ్యాడు.

Director Puri Jagannadh Son Hero Akash Puri Love Marriage Rumours Viral

అతను ఎవరో కాదు.... పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి. ఈ కుర్ర హీరో ఓ పొలిటికల్ లీడర్ కూతురితో గత కోన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆకాశ్ పూరి లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు సమాచారం. తన క్లాస్ మెట్ అయినటు వంటి ఓ అమ్మాయిని ఆకాశ్ చాలా ఏళ్లుగా ప్రేమిస్తున్నాడట. ఈ క్రమంలో వీరి ప్రేమను ఇంట్లో చెప్తే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆకాష్ పూరి త్వరలో నిశ్చితార్థం చేసుకుని... పెళ్లి కూడా నెక్ట్స్ ఇయర్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. ఇక ఆకాష్ పూరీ చేసుకోబోయే అమ్మాయిది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తోంది. ప్రముఖ పొలిటికల్ సీనియర్ లీడర్ మనవరాలుగా తెలుస్తుంది. కోట్ల ఆస్తికి వారసురాలు అయిన ఆ అమ్మాయి ఆకాశ్ ను ప్రేమించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Director Puri Jagannadh Son Hero Akash Puri Love Marriage Rumours Viral

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. పూరీ జగన్నాద్ కానీ, ఆకాష్ కానీ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలుస్తోంది. ఇక ఆకాష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంటర్ అయ్యి... నటనలో స్టార్స్ ను మించిపోయాడు. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆకాష్.

ఇక ఆకాష్ నటించిన చివిరి చిత్రం రొమాంటిక్. ఈ సినిమా పర్వాలేదనిపించింది. తండ్రికి తగ్గ తనయుడిగా ఆకాష్ అయితే నటనలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక పూరీ జగన్నాథ్ లైగర్ దెబ్బకు మళ్లీ తనకు హిట్ ఇచ్చిన రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డబుల్ ఇస్మార్ట్ గా వచ్చే ఏడాది రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X