మరో మాస్ యువ హీరోతో పూరి జగన్నాథ్ మూవీ.. ఊహించని కాంబినేషన్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన మాస్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఒకతరం హీరోలు అందరితోనూ వర్క్ చేశాడు. అలాగే నేటి తరం హీరోలతో కూడా ఆయన వర్క్ చేసేందుకు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు.

వరుస ఆపజయలతో సతమతమవుతున్న టైమ్ లోనే పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నాడు. రామ్ పోతినేనిని ఊర మాస్ లుక్ లో చూపించిన పూరి ఆ తర్వాత లైగర్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది.

Director puri jagannadh upcoming project with young hero latest update

ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం కూడా ఆసక్తిగా మారింది. ఆ మధ్యకాలంలో అయితే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు అని కథనాలు వెలువడ్డాయి. ఇక మెగాస్టార్ ప్రత్యేకంగా పిలిపించుకొని మరి పూరికి ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం పూరి జగన్నాథ్ యువ హీరో విశ్వక్ సేన్ తో కూడా సినిమా చేసేందుకు ఆలోచిస్తున్నట్లుగా కొత్త న్యూస్ వైరల్ అవుతోంది.

ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ హీరో.. స్టార్ దర్శకులతో వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ తరుణంలో పూరి జగన్నాథ్ ఈ హైవోల్టేజ్ మాస్ హీరోతో వర్క్ చేస్తే తప్పకుండా కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అని ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక వీరు కలుసుకొని కథ గురించి చర్చించారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరి పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X