Don't Miss!
- News
సీఎం జగన్ -కోటంరెడ్డి మధ్య ఏం జరిగింది : గ్యాప్ మొదలైంది అక్కడేనా..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మరో కన్నడ స్టార్ హీరోతో పూరి జగన్నాథ్ న్యూ మూవీ?
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఏ హీరో వర్క్ చేసినా కూడా జనాల్లో ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే వీలైనంత వరకు పూరి హీరోలలో ఉన్న అసలైన ఎనర్జీని బయటకు తెప్పిస్తాడు. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు అందరి హీరోలతో వర్క్ చేశారు.
అప్పుడప్పుడు కన్నడ ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తరువాత అక్కడి నుంచి ఒక ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొన్నటివరకు పూరితో KGF స్టార్ యష్ నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మరొక హీరో పేరు వైరల్ అవుతోంది.

సీనియర్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జాతో పూరి జగన్నాథ్ హై వోల్టేజ్ మాస్ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ధృవ.. పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక ఫైనల్ గా ఈ యాక్టర్ పూరి జగన్నాథ్ తో ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయించుకున్నట్లు సమాచారం. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.