విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ కాదు.. టైటిల్ మార్చేసి షాకిచ్చిన పూరీ జగన్నాథ్

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సూపర్ పవర్ స్టార్ విజయ దేవరకొండతో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ కథా నేపథ్యంతో తెరకెక్కిస్తూ ఫైటర్ టైటిల్‌తో చకచకా తొలి షెడ్యూల్‌ను పూరీ పూర్తి చేసేశాడు. తొలుత తెలుగు వరకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్‌ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా మూవీగా మారిపోవడంతో ప్రస్తుతం టైటిల్‌ను మార్చేసినట్టు సమాచారం. ఫైటర్ అనే టైటిల్‌ను మార్చేస్తూ తీసుకొన్న నిర్ణయంపై త్వరలోనే ఓ ప్రకటన అధికారికంగా వెళ్లడించనున్నారు. ఇంతకు కొత్త టైటిల్ ఏమిటంటే..

ప్యాన్ ఇండియా మూవీగా ఫైటర్‌

ప్యాన్ ఇండియా మూవీగా ఫైటర్‌

వైష్ణో అకాడమీ బ్యానర్‌పై ఫైటర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ చిత్రం జాతీయ ప్రాజెక్ట్‌గా మారిపోయింది. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లో ప్రవేశించడంతో ఈ చిత్రం బాలీవుడ్ రేంజ్‌‌కు చేరుకొన్నది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పేరుతోనే టైటిల్‌ను పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో

పూరీ, కరణ్ జోహర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్ ఫైటర్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పేరు లైగర్. ఆ పేరునే సినిమాకు పెట్టాలని పూరి, హీరో విజయ్ దేవరకొండ నిర్ణయం తీసుకొన్నారట. ఈ నిర్ణయానికి కరణ్ జోహర్ కూడా ఓటేసినట్టు సమాచారం. దాంతో ఫైటర్ కాస్త లైగర్ అనే టైటిల్‌గా మారబోతున్నది.

ఫైటర్ పేరు మార్పుతో

ఫైటర్ పేరు మార్పుతో

లైగర్ టైటిల్ అంటే చాలా కొత్తగాను, గమ్మత్తుగాను అనిపించడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే పూరీ పెట్టే టైటిల్స్ చాలా క్రేజీగా ఉంటాయనేది తెలిసిందే. తాజాగా లైగర్ అనే టైటిల్ వెనుక ఆసక్తికరమైన అంశం దాగి ఉండటం పూరి మార్కుకు నిదర్శనం. లైగర్ అంటే లయన్, టైగర్ రెండు పదాల్లోంచి పుట్టిన టైటిల్.

క్రేజీ టైటిల్ వెనుక స్టోరీ

క్రేజీ టైటిల్ వెనుక స్టోరీ

లైగర్‌గా ప్రచారం అవుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులవి ఫవర్‌ఫుల్ పాత్రలు. ఆడపులి లాంటి తల్లి, సింహం లాంటి తండ్రి పుట్టిన కొడుకుకు లైగర్ అనే పేరు పెట్టడం జరిగిందట. అయితే ఈ టైటిల్‌ను కొనసాగిస్తారా? లేదా అనే విషయం కోసం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో లైగర్ ఊరఫ్ విజయ్ దేవరకొండ సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్‌గా

వరల్డ్ ఫేమస్ లవర్‌గా

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నది. ప్రేమికుల రోజున విడుదల కాబోయే చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, తనయుడు వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాశీఖన్నా, క్యాథరీన్ త్రెసా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లే లీటే తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X