ఎన్టీఆర్ బయోపిక్ రేసులో నలుగురు దర్శకులు.. ఎవరిదో గోల్డెన్ హ్యాండ్!
దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవడం సంచలంగా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరించడం అంటే సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినీ రాజకీయ అంశాలతో ముడిపడి ఉంది. ఆయన చివరి రోజుల్లో జరిగిన సంఘటనలని ఎలాంటి వివాదం లేకుండా చూపించడం అంత సులువు కాదు.
దర్శకుడు తేజ, బాలయ్య మధ్య కథ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితచరిత్రని ఎక్కడినుంచి ఎక్కడి వరకు చూపించాలనే అంశంలో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తాను అభిమానించే నటుడని, ఆయన జీవిత చరిత్రని సరైన విధంగా తెరకెక్కించలేననే అనుమానంతోనే తాను తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటించారు.

కాగా అప్పుడే బాలయ్య కొత్త దర్శకుల వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బియోపిక్ కోసం ప్రధానంగా నలుగురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, కృష్ణ వంశి, పూరి జగన్నాథ్, పి వాసు పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే ఆ గోల్డెన్ హ్యాండ్ ఎవరిది అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











