‘ఉయ్యాలవాడ...’ కోసం హాలీవుడ్ నుండి టెక్నీషియన్స్?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ అంటే... బ్రిటిష్ కాలం నాటి సెట్టింగులతో అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా ఉండాలి. ఇవన్నీ తెరపై అధ్బుతంగా చూపించాలంటే సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి....
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మెగా 150 చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మించిన రామ్ చరణే ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తొలుత ఈ చిత్రాన్ని రూ. 70 నుండి 80 కోట్ల లోపు బడ్జెట్లో తీద్దామని అనుకున్నప్పటికీ..... ఇపుడు రూ. 100 కోట్లకు మించిన బడ్జెట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సాంకేతికంగా ఉన్నతంగా...
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ అంటే... బ్రిటిష్ కాలం నాటి సెట్టింగులతో అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా ఉండాలి. ఇవన్నీ తెరపై అధ్బుతంగా చూపించాలంటే సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి.... ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్
తెలుగులో బాహుబలి, బాహుబలి-2 లాంటి భారీ చిత్రాలు వచ్చిన నేపథ్యంలో..... ‘ఉయ్యాలవాడ....' విషయంలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టూడియల్లో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ జరుగబోతోంది.

భారీ బడ్జెట్
ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ భాగా పెరిగిన నేపథ్యంలో.... కాస్త బడ్జెట్ ఎక్కువైనా సరే సినిమాను క్వాలిటీగా తీయాలి. మెగాస్టార్ ఇమేజ్ నిలబెట్టే విధంగా సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రూ. 120 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

అద్భుతంగా ఉంది: చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పోస్టర్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











