»   » అద్భుతంగా ఉంది: చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పోస్టర్

అద్భుతంగా ఉంది: చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చేయబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు చేయబోతున్నట్లు టాక్.

ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ మధ్య 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో చిరంజీవి మాట్లాడుతూ కెరీర్లో తాను భగత్ సింగ్ పాత్ర చేయలేక పోయాను. అందుకు బదులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.

చిరంజీవి ఆ ప్రకటన చేసినప్పటి నుండి అభిమానులు బాస్ 151 సినిమా అదే అని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఫ్యామేడ్ పోస్టర్లు కొన్ని ఇంటర్నెట్ లో హచల్ చల్ చేస్తున్నాయి.

సూపర్బ్ లుక్

సూపర్బ్ లుక్

తాజాగా ఓ అభిమాని డిజైన్ చేసిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్

రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 1840 బ్రిటిష్ కాలంలో రాయలసీమ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సెట్ ను తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం.

త్వరలో అఫీషియల్ ప్రకటన

త్వరలో అఫీషియల్ ప్రకటన

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి త్వరలో అఫీషియల్ ప్రకటన వెలువడనుంది. మంచి ముహూర్తం చూసి సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి బిజీ బిజీ

సురేందర్ రెడ్డి బిజీ బిజీ

ఇటీవల కొణిదెల ప్రొడక్షన్స్ వార్షిక వేడుకలో సురేందర్ రెడ్డిని తమ సంస్థలోకి ఆహ్వానిస్తున్నట్లు రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఐశ్వర్యారయ్ హీరోయిన్ అంటూ పుకారు

ఐశ్వర్యారయ్ హీరోయిన్ అంటూ పుకారు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ ఓ పుకారు ప్రచారంలోకి వచ్చింది. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

English summary
We all know that Megastar Chiranjeevi is getting ready for his 151st film 'Uyyalawada Narasimha Reddy', a historical film on the life of freedom fighter with the same name. Even though the film has not been launched officially, a fanmade poster is doing rounds in the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu