మహేష్ బాబుని వాడేసుకుంటారా.. పూరి జగన్నాథ్ కొత్త స్ట్రాటజీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన పోకిరి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బిజినెస్ మాన్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా వినిపిస్తున్న ఊహాగానాలు మహేష్ బాబు గురించి కాకపోయినా అతడికి కూడా లింక్ ఉంది. డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి చాలా రోజులగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. యువ హీరో రామ్ పరిస్థితి కూడా దాదాపుగా అంతే. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

వరుసగా పరాజయాలు
పూరి జగన్నాథ్ కు టెంపర్ చిత్రం తర్వాత సరైన హిట్ లేదు. లోఫర్, ఇజం, పైసావసూల్, మెహబూబా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. తన కొడుకుతో ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన మెహబూబా చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరో రామ్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

కొత్త స్ట్రాటజీ
పూరి జగన్నాథ్ చిత్రాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలో చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. ఇటీవల పూరి చిత్రాల్లో అది కొరవడిందనే విమర్శలు ఎదురవుతున్నాయి. మరోవైపు పూరి జగన్నాథ్ ఎక్కువగా నెగిటివ్ రోల్స్ ని పెడుతుంటారు. ఈ చిత్రంలో కొత్త స్ట్రాటజీ ఉపయోగించాలని పూరి భావిస్తున్నాడు. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఉపయోగించుకుని పవర్ ఫుల్ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆసక్తికరమైన టైటిల్
ఈ చిత్రానికి పండుగాడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పండుగాడు అనే టైటిల్ వినగానే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ చిత్రం పోకిరి గుర్తుకు రావడం ఖాయం. పూరి దర్శత్వంలోనే ఆ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. పోకిరి చిత్రంలో పండుగాడిగా మహేష్ మామూలు రచ్చ చేయలేదు. ఆ టైటిల్ రామ్ చిత్రానికి పెడితే త్వరగా జనాల్లోకి వెళుతుందని భావిస్తున్నారు. మహేష్ క్రేజ్ కూడా ఉపయోగపడుతుంది.

సొంత నిర్మాణంలోనే
పూరి జగన్నాథ్ సొంత నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందబోతోంది. హీరోయిన్ ఛార్మి కూడా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇదిలా ఉండగా హీరో రామ్ కి కూడా ఈ చిత్రం చాలా కీలకం. నేను శైలజ చిత్రం తర్వాత రామ్ కు పరాజయాలే ఎదురయ్యాయి. గత ఏడాది విడుదలైన హలొ గురు ప్రేమ కోసమే చిత్రం మాత్రం పర్వాలేదనిపించింది.


Click it and Unblock the Notifications











