ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసిన పూరి.. అందుకే విజయ్ దేవరకొండతో!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో త్వరలో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో జోష్‌లో ఉన్న పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ ఒక్కసారిగా అందరి కళ్లు ఈ కాంబోపైనే పడ్డాయి. కాగా తాజాగా ఈ సినిమా విషయమై ఓ ఆసక్తికర అప్‌డేట్ తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దామా..

 మరింత మాస్ మసాలా.. ఈ సారి అదిరిపోయేలా

మరింత మాస్ మసాలా.. ఈ సారి అదిరిపోయేలా

మాస్ మసాలా స్టోరీతో 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ ఇవ్వడంతో.. ఇకపై మాస్ సినిమాలే చేయాలనే నిర్ణయానికి వచ్చారు పూరి జగన్నాథ్. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండతో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ రూపొందించే పనిలో పడ్డారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దేస్తున్నారు కూడా.

బాక్సర్‌గా విజయ్ దేవరకొండ.. టైటిల్‌పై క్లారిటీ

బాక్సర్‌గా విజయ్ దేవరకొండ.. టైటిల్‌పై క్లారిటీ

ఇటీవలే ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఓ వార్త బయటకు వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, అలాగే ఈ చిత్రానికి 'ఫైటర్' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారని వార్తలు వచ్చాయి. ఇందులో బాక్సర్‌గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అన్నారు. దీనిపై అఫీషియల్ సమాచారం బయటకు రాకముందే ఈ సినిమా పూరి కెరీర్‌లో వచ్చిన ఓ సినిమాకు సీక్వల్ అని మరో సమాచారం షికారు చేస్తోంది.

సిమిలర్ స్క్రిప్ట్ రెడీ చేసిన పూరి

సిమిలర్ స్క్రిప్ట్ రెడీ చేసిన పూరి

రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి.. ఇదే సినిమాకు సిమిలర్ స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో కూడా బాక్సింగ్ సన్నివేశాలు అబ్బురపరిచేలా రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇది 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సీక్వల్ అని కూడా అంటున్నారు కొందరు.

త్వరలోనే పూర్తి సమాచారం

త్వరలోనే పూర్తి సమాచారం

ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. పూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ తెరకెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X