నిన్న ‘ఇస్మార్ట్ శంకర్’.. నేడు ‘ఎవరు’.. ఇండస్ట్రీలో అసలేం జరుగుతుంది?

Recommended Video

Are Tollywood Movies Getting Inspired From Hollywood Movies Now A Days ? || Filmibeat Telugu

అడవి శేష్.. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. 'క్ష‌ణం', 'అమీ తుమీ', 'గూఢ‌చారి' వంటి వినూత్న కథాంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ టాలెంటెడ్ హీరో కమ్ రైటర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఎవరు'. కొత్త దర్శకుడు రామ్ జీ‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. పీవీపీ సినిమాస్ బ్యాన‌ర్‌‌లో 'ఎవరు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'క్షణం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అడవి శేష్, పీవీపీ కాంబో మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకున్నారు

ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకున్నారు

కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ దీనిపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్‌లో పగిలిన అద్దంలో రెజీనా ముఖం కనిపిస్తుంది. దాన్ని ఓ మహిళ పట్టుకుని ఉండగా, ఎదురుగా శేష్ పోలీసు డ్రెస్‌లో కనిపిస్తున్నాడు. అసలు అద్దంలో ఉన్నది ఎవరు..? ఆ అద్దానికి అంటిన రక్తం ఎవరిది..? ఎదురుగా పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఉన్నారు? ఆ అద్దాన్ని పట్టుకుంది ఎవరు..? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తుతూ అసలు సిసలు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇలానే ఉంటుందని ‘ఎవరు' మూవీ ఫస్ట్ లుక్‌తోటే సర్ ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్.

హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ..

హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ..

తాజాగా ఈ సినిమాపై ఓ రూమర్ బయటకు వచ్చింది. ‘ఎవరు' సినిమా కథను హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టారన్న టాక్ వినిపిస్తోంది. స్పానిష్‌లో 2016లో వచ్చిన ‘ది ఇన్ విజుబుల్ గెస్ట్' సినిమా నుంచే ‘ఎవరు' కథను కాపీ కొట్టారని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇదే కథాంశంతో బాలీవుడ్‌లోనూ గతంలో ఓ సినిమా వచ్చింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘బద్లా' ఇదే తరహాలో ఉంటుంది. ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

‘ఇస్మార్ట్' కూడా కాపీ అన్నారు

‘ఇస్మార్ట్' కూడా కాపీ అన్నారు

‘ఇస్మార్ట్ శంకర్' బ్రిటన్‌కు చెందిన ‘ఐబాయ్' నుంచి కాపీ కొట్టారన్న టాక్ వినిపిస్తోంది. కొందరు ఈ సినిమా ‘ఐబాయ్'కు కాపీనా..? లేక రీమేకా..? అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను కెవిన్ బ్రూక్స్‌ నవల ఆధారంగా ఆడమ్ రాండెల్ తెరకెక్కించాడు. ఈ నవలలో కోమా నుంచి బయటకు వచ్చిన ఓ టీనేజర్ గురించి ఉంటుంది. అందులో అతడి మెదడులో సెల్‌ఫోన్ ఉండడంతో సూపర్ హ్యూమన్‌లా మారతాడు. ఇప్పుడిదే కథ ‘ఇస్మార్ట్'లో ఉంటుందన్న కామెంట్లు వినిపించాయి.

పూరీ క్లారిటీ ఇచ్చాడు

పూరీ క్లారిటీ ఇచ్చాడు

చిత్ర ప్రమోషన్‌లో పాల్గన్న పూరీ సినిమా కాపీ అని వస్తున్న వార్తలపై స్పందించాడు. తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇస్మార్ట్ శంకర్' ఓ హాలీవుడ్‌ సినిమాకు కాపీ అని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ సినిమాను కొన్ని హాలీవుడ్ చిత్రాల నుంచి స్పూర్తి పొంది తెరకెక్కించాను. అంతేకానీ, ఏ సినిమానూ కాపీ కొట్టలేదు. ఈ విషయం మీకు తెలియాలంటే నా సినిమా విడుదల అయ్యాక చూడండి. అలాగే ఏ సినిమా నుంచైతే కాపీ అంటున్నారో ఆ సినిమానూ చూడండి'' అంటూ చెప్పుకొచ్చాడు.

‘సాహో' వల్ల ముందుకు..

‘సాహో' వల్ల ముందుకు..

‘ఎవరు' సినిమాను మొదట ఆగస్టు 23న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ‘సాహో' వాయిదా పడటంతోనే విడుదల తేదీని ఆగస్టు 15కి మార్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మిగిలిన అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X