దీపిక పదుకోన్ ప్రెగ్నెంట్.. ఆ ఒక్క మాటతో రూమర్లకు చెక్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్‌పై రూమర్లు, గాసిప్స్ సహజంగానే మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వాటిలో కొన్నింటికి జవాబిస్తుంటారు. మరికొన్ని విషయాలను దాట వేస్తుంటారు. అయితే తాజాగా దీపిక పదుకోన్‌పై ఎక్కువగా వినిపించే విషయం ఆమె ప్రెగ్నెంట్ అనే వార్త. అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై ఆమె సుత్తి లేకుండా సూటిగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా బాఫ్టా అవార్డుల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంతానం గురించి వివరణ ఇచ్చారు. ఆమె చెప్పిన విషయాల్లోకి, బాఫ్టాలో దీపిక పదుకొన్ వ్యవహారాల గురించిన వివరాల్లోకి వెళితే..

2024 సంవత్సరపు బాఫ్టా అవార్డుల వేడుకల్లో దీపిక తన అందాలతో మెరుపులు మెరిపించింది. ఈ సినిమా అవార్డుల ఫంక్షన్ కోసం ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో అరుదైన గౌరవాన్ని అందుకొన్నది. 77వ అవార్డుల ప్రజెంటేషన్ కార్యక్రమంలో సినీ క్రీడా దిగ్గజాలతో కలిసి వేదికను పంచుకొన్నది. ఫుట్ బాల్ మాంత్రికుడు డేవిడ్ బెక్‌హామ్, ఆస్ట్రేలియా నటి, నిర్మాత కేట్ బ్లాంకెట్, ఇంగ్లీష్, అల్బేనియన్ సింగర్ డుయా లిపాతో కలిసి ప్రజెంటర్‌గా వ్యవహరించింది.

Is Deepika Padukone Pregnant? She looks mysterious at 77 Bafta Awards

బాఫ్టా అవార్డుల వేదికలో దీపిక పదుకోన్ బాడీ లాంగ్వేజ్ కొంత డిఫరెంట్‌గా కనిపించింది. ఈ వేడుకల్లో తన కడుపును కవర్ చేసి జాగ్రత్త వహించడంతో ఆమె గర్బవతి అయిందా? అనే అనుమానాలు వచ్చాయి. వేదికపైన, కింద తన కడుపును పదే పదే దాచుకోవడంతొ మరోసారి చర్చనీయాంశమైంది. దాంతో మీడియాను ప్రెగ్నెన్సీ విషయంపై ఆరా తీసింది. దాంతో ఆమె తనపై వస్తున్న వార్తలపై ఓపెన్ అయింది.

ప్రియుడికి జబర్ధస్త్ బ్యూటీ బ్రేకప్.. దానికి ఒప్పుకోకపోవడం వల్లే అంటూ!\

దీపిక మాట్లాడుతూ.. నాకు, రణ్‌వీర్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. మాకు సొంతంగా ఓ ఫ్యామిలీ ఉండాలని ఆలోచిస్తున్నాం. పిల్లల్ని పెంచడానికి వీలైనంత సమయం ఉండాలి. వారిని సరైన పద్దతిలో, విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వాలి. ఆ రోజు కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాం. సమయం వచ్చినప్పుడు ఆ శుభవార్తను వెల్లడిస్తాం అని చెప్పింది.

Is Deepika Padukone Pregnant? She looks mysterious at 77 Bafta Awards

దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ దాంపత్య జీవితం విషయానికి వస్తే.. రామ్ లీలా సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఇద్దరు.. చాలా ఏళ్లు డేటింగ్ చేశారు. అనంతరం ఇటలీలోని లేక్ కోమోలో నవంబర్ 14వ తేదీ, 2018 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్టు ఆమె క్లారిటీ ఇచ్చారు.

దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. 2023లో భారీ విజయాలను అందుకొన్నది. పఠాన్, జవాన్, ఫైటర్ సినిమాలతో దూసుకెళ్తున్నది. ప్రస్తుతం సింగం రిటర్న్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. సింగమ్ రిటర్న్ ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X