‘ఇస్మార్ట్ శంకర్’ ఆ సినిమాకు కాపీనా? లేక రీమేక్ చేశారా?

బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ హీరో రామ్ కలయికలో వస్తున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. చాలా కాలం హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఇద్దరు నటులు ఈ సారి ఎలాగైనా ఆ కోరికను తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకోసమే పక్కా మాస్ మసాలా కథతో వస్తున్నారు. పూరీకి ఇలాంటి సినిమాలు కొత్తేం కాకపోయినా.. రామ్ మాత్రం 'జగడం' తర్వాత ఈ తరహా సినిమా చేయడం ఇదే తొలిసారి. అందుకే దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పూరీ తెరకెక్కించిన ఈ సినిమా ఓ బ్రిటీష్ సినిమాకు కాపీ అనేదే ఆ వార్త సారాంశం. ఎప్పుడూ ఒకే కథను మార్చి మార్చి తీస్తాడనే చెడ్డ పేరును మూటగట్టుకున్న పూరీ జగన్నాథ్.. ఈ సారి కొత్త కథతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే డబుల్ సిమ్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడు.

Is Ram Pothineni iSmart Shankar copy of IBoy..?

అయితే, 'ఇస్మార్ట్ శంకర్' బ్రిటన్‌కు చెందిన 'ఐబాయ్' నుంచి కాపీ కొట్టారన్న టాక్ వినిపిస్తోంది. కొందరు ఈ సినిమా 'ఐబాయ్'కు కాపీనా..? లేక రీమేకా..? అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను కెవిన్ బ్రూక్స్‌ నవల ఆధారంగా ఆడమ్ రాండెల్ తెరకెక్కించాడు. ఈ నవలలో కోమా నుంచి బయటకు వచ్చిన ఓ టీనేజర్ గురించి ఉంటుంది. అందులో అతడి మెదడులో సెల్‌ఫోన్ ఉండడంతో సూపర్ హ్యూమన్‌లా మారతాడు. ఇప్పుడిదే కథ 'ఇస్మార్ట్'లో ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

పూరీ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందనే వచ్చింది. ఇందులో రామ్ సరికొత్త లుక్, డైలాగ్ డెలివరీని ప్రయత్నించాడు. మరి, ఈ సినిమాతోనైనా పూరీ, రామ్ హిట్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X