ప్రభాస్ స్పిరిట్ మూవీ కథ ఇదేనా? సందీప్ రెడ్డి వంగా అరాచకం మరో లెవెల్!
Prabhas Spirit: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌తో ఒక్కో కొత్త జానర్‌ను టచ్ చేస్తూ.. తన మార్కెట్‌ను దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ పై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా స్పిరిట్ మూవీ కథ ఇదే అంటూ ఓ బజ్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటీ?
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి కాంట్రవర్సీతో పాటు బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడంతో 'స్పిరిట్'పై మొదటి నుంచే నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లోనూ, ఫ్యాన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రుప్తి దిమ్రి (Tripti Dimri) నటిస్తోంది. 'యానిమల్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న త్రుప్తి, ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇక ఇతర కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కంచన నటిస్తున్నారని టాక్. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ జైలర్ పాత్రలో కనిపించనున్నారని వినిపిస్తోంది. బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందట.
ఇప్పటికే 'స్పిరిట్' డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులు ఏకంగా రూ.160 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఇది ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు మరో నిదర్శనంగా మారింది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది.
ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'స్పిరిట్'లో ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్, డెప్త్ క్యారెక్టర్ ఉన్న రోల్ క్రియేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 'యానిమల్' తరహాలో క్యారెక్టర్ మైండ్‌సెట్‌ను లోతుగా చూపించే కథనంతో 'స్పిరిట్' రూపొందుతున్నట్లు సమాచారం.
లేటెస్ట్‌గా వైరల్ అవుతున్న బజ్ ప్రకారం.. 'స్పిరిట్' సోర్టీ లైన్ ప్రధానంగా జాతీయ భద్రతా సమస్య చుట్టూ తిరుగుతుందట. దేశ భద్రతకు పొంచి ఉన్న భారీ ప్రమాదాన్ని ఎదుర్కొనే నిజాయితీ గల పోలీస్ అధికారిగా ప్రభాస్ కనిపించనున్నారని టాక్. దేశాన్ని ప్రతినిధ్యం వహించేలా ఆయన క్యారెక్టర్ ఉంటుందని, అడుగడుగునా దేశ భద్రతను కాపాడే విధంగా కథ నడుస్తుందని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, విలన్ల మధ్య గూస్‌బంప్స్ ఇచ్చే యాక్షన్ సీన్స్ డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది.
అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. సుధీర్, రష్మి లవ్ ట్రాక్ పై చమ్మక్ చంద్ర క్లారిటీ..
ఇక షూటింగ్ విషయానికి వస్తే, 2025 నవంబర్‌లో గ్రాండ్ ముహూర్తంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, త్వరలో మెక్సికోలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ మధ్యలో చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ మళ్లీ ఊపందుకోనుంది. సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్‌తో రూపొందుతున్న ఈ మూవీ 2026 చివర్లో లేదా 2027లో థియేటర్లలో విడుదల కానుంది. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం 'స్పిరిట్' కోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.


Click it and Unblock the Notifications











