ఇస్మార్ట్ పోరి దిమ్మతిరిగే డిమాండ్.. ఓ రేంజ్ రెమ్యునరేషన్‌తో గొంతెమ్మ కోరిక
ఇస్మార్ట్ పోరి నభా నటేష్ భారీగా డిమాండ్ చేస్తోందట. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ రెమ్మ్యూనరేషన్ విషయంలో ఆశలు వెనక్కి తగ్గడం లేదట. ఈ మేరకు ఆమెకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో నటించే అవకాశం రావడం, దానికి ఆమె భారీ సొమ్ము డిమాండ్ చేయడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నభా నటేష్ ఛాన్స్ పెట్టేసిందట. అందాల ఆరోబోతకు, అబ్బురపరిచే అభినయానికి ఏ మాత్రం వెనుకడుగేయని ఈ ముద్దుగుమ్మతో ఈ సినిమాలో సూపర్ హాట్ సీన్స్ చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే అన్నింటికీ ఓకే కానీ ఈ సినిమాలో నటించాలంటే తనకు కోటి రూపాయల రెమ్మ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేసిందట ఇస్మార్ట్ పోరి. నభా నటేష్ మాటకు ఆ చిత్ర నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.

రేపు (నవంబర్ 29) ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందట. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మరోవైపు 'నన్ను దోచుకుందువటే' అంటూ తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్.. ప్రస్తుతం రవితేజ జోడీగా 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తోంది. డిసెంబర్ చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది నభా నటేష్.


Click it and Unblock the Notifications











