ఫుల్లుగా పెంచేసిన నభా నటేష్.. అట్రాక్ట్ అవుతున్న మూవీ మేకర్స్

హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ తమ తమ కెరీర్లో తక్కువ సినిమాలు చేస్తుంటారు. ఆ నటి నుంచి నేటివరకు ఇదే తీరు కొనసాగుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో అయితే మరీను. ఓ హీరోయిన్ 10 సినిమాలు చేస్తే గ్రేట్ అనే స్థాయిలో ఉంది పరిస్థితి. మరి ఇలాంటి స్థితిలో ఏ మాత్రం కొద్ది పాపులారిటీ వచ్చినా ఆ హీరోయిన్ చేయాల్సిన పని రెమ్మ్యూనరేషన్ పెంచేయడం. ఇస్మార్ట్ బ్యూటీ కూడా చాలా స్మార్ట్‌గా అదే చేస్తోంది. వివరాల్లోకి పోతే..

రామ్‌తో రొమాన్స్.. సూపర్ పాపులారిటీ

రామ్‌తో రొమాన్స్.. సూపర్ పాపులారిటీ

‘నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్.. 'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ చిత్రసీమలో సూపర్ క్రేజ్‌ కొట్టేసింది. నేటి యువతకు కావాల్సిన అందం, అభినయం రెండూ తనలో ఉన్నాయని నిరూపించుకుంది.

 ఇస్మార్ట్ బ్యూటీ డిమాండ్.. తెలివిగా ఆలోచించి!

ఇస్మార్ట్ బ్యూటీ డిమాండ్.. తెలివిగా ఆలోచించి!

‘ఇస్మార్ట్ శంకర్' సినిమా నభా కెరీర్‌కి బాగా ప్లస్ అయింది. మాస్ క్యారెక్టర్‌తో పాటు హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ దర్శకనిర్మాతలకు గాలం వేసేసింది నభా. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కాస్త తెలివిగా ఆలోచించి రెమ్మ్యూనరేషన్ పరంగా బాగా డిమాండ్ చేస్తోందట.

 అదిరిపోయే ఆఫర్.. డబుల్ చేసేసింది

అదిరిపోయే ఆఫర్.. డబుల్ చేసేసింది

'ఇస్మార్ట్ శంకర్' సినిమా కంటే ముందు 10 లక్షల రెమ్మ్యూనరేషన్ మాత్రమే తీసుకున్న నభా.. 'ఇస్మార్ట్ శంకర్'లో నటించినందుకు గాను 20 లక్షలు తీసుకుంది. ఆ సినిమా హిట్ కావడంతో తన రెమ్మ్యూనరేషన్ మరోసారి డబుల్ చేసి 40 లక్షల ఆఫర్ దక్కించుకుంది.

 ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేయడమంటే మామూలు కాదు!

ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేయడమంటే మామూలు కాదు!

ప్రస్తుతం రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కోరాజా' సినిమాలో నభా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమెకు 40 లక్షల పారితోషికం ఇచ్చారట నిర్మాతలు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అయినప్పటికీ నభాకు ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేయడమంటే మామూలు విషయం కాదు.

నభా నటేష్ స్మార్ట్‌నెస్.. ఎంతైనా ఓకే అనేస్తున్న నిర్మాతలు

నభా నటేష్ స్మార్ట్‌నెస్.. ఎంతైనా ఓకే అనేస్తున్న నిర్మాతలు

ఇక ఇటీవలే మరో సినిమాను కన్ఫర్మ్ చేసింది నభా నటేష్. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకిగాను నభా 80 లక్షలను డిమాండ్ చేయగా, అంత ఇచ్చుకునేందుకు నిర్మాతలు ఇవ్వడానికి అంగీకరించారట. అంటే సినిమా సినిమాకు నభా డబుల్ పారితోషికం అందుకుంటూ తన స్మార్ట్‌నెస్ చూపిస్తోందన్నమాట.

ఆ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా.. త్వరలోనే

ఆ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా.. త్వరలోనే

ఈ లెక్కన చూస్తే నభా త్వరలోనే కోటి రూపాయల మార్క్ ఈజీగా దాటేసి, స్టార్ హీరోయిన్ల స్థాయికి ఎదగనుందని అర్థమవుతోంది. ఎంతైనా ఇస్మార్ట్ బ్యూటీ కదా! ఈ మాత్రం స్మార్ట్ పోకడ ఉండదా మరి!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X