‘ఇస్మార్ట్ శంకర్’ ఫలితం.. బాధపడుతున్న మెగా హీరో.. పూరీ అలాంటోడే మరి.!

Recommended Video

Is This Mega Hero Sad With iSmart Shankar Hit? || Filmibeat Telugu

'ఇస్మార్ట్ శంకర్'.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో వచ్చిన పక్కా మాస్ మసాలా చిత్రం. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా ఊహించన దాని కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే బీ, సీ సెంటర్లలో హవా చూపిస్తోంది. దీంతో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఈ సినిమా విజయంతో అటు పూరీ అభిమానులు.. ఇటు రామ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. అయితే, ఓ మెగా హీరో మాత్రం తెగ బాధ పడిపోతున్నాడని తెలుస్తోంది.

తన కొడుకు కోసం రాసిన కథ

తన కొడుకు కోసం రాసిన కథ

కొడుకును స్టార్ హీరోగా చేయాలని పూరీ జగన్నాథ్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడితో ‘మెహబూబా' అనే సినిమా కూడా చేశాడు. అయితే, ఆ సినిమా నిరాశ పరచడంతో, మరో కథ రాశాడట. అదే.. ‘ఇస్మార్ట్ శంకర్' అని తెలుస్తోంది. ఈ కథను ఆకాశ్ కోసమే రాశాడట పూరీ. అయితే, అప్పుడే హెవీ మాస్ బాగోదని కొందరు సలహా ఇవ్వడంతో అతడితో సినిమా చేయలేదని టాక్.

మెగా హీరోకు వినిపించాడట

మెగా హీరోకు వినిపించాడట

పూరీ ఆకాశ్‌ను వద్దనుకున్న తర్వాత ఈ కథను మెగా హీరోల్లో ఒకడైన సాయి ధరమ్ తేజ్‌కు వినిపించాడ పూరీ జగన్నాథ్. అప్పటికే వరుస ఫ్లాప్‌లతో బాధపడుతున్న సాయి ధరమ్ తేజ్.. పూరీతో సినిమా చేయడానికి ధైర్యం చేయలేదని తెలిసింది. అందునా.. మాస్ సినిమా కావడంతో నమ్మకం లేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాధపడుతున్న మెగా హీరో

బాధపడుతున్న మెగా హీరో

తాను నమ్మకం లేక వద్దనుకున్న సినిమా భారీ హిట్ అవడంతో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తెగ బాధపడిపోతున్నాడని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా తాను చేసుంటే కెరీర్ మలుపు తిరిగిపోయి ఉండేదని అతడు తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

రామ్ అడిగాడని కొన్ని మార్పులు

రామ్ అడిగాడని కొన్ని మార్పులు

రామ్‌తో సినిమా అనుకున్నప్పుడు కథలో కొన్ని మార్పులు చేశానని పూరీ చెబుతున్నాడు. ఇప్పటి వరకు నన్ను గుడ్‌ బాయ్‌గా చూశారు.. మీరు నన్ను ప్యూర్ బ్యాడ్ బాయ్‌గా చూపించాలని రామ్.. పూరీని కోరాడని అతడే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

పూరీ అంటే ఇంతే మరి

పూరీ అంటే ఇంతే మరి

వాస్తవానికి పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాప్‌లతో బాధపడుతున్నప్పటికీ, అతడి టాలెంట్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైనా భారీ హిట్ కొట్టే సత్తా ఉన్న దర్శకుడే. కాకపోతే కొన్ని ఫ్లాప్‌లు వచ్చే సరికి అతడిని అందరూ లైట్ తీసుకున్నారు. ఇక, ఇప్పటి నుంచి వరుస సినిమాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 ‘ఇస్మార్ట్ శంకర్'

‘ఇస్మార్ట్ శంకర్'

విజయం కోసం పరితపిస్తున్న పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X