రౌడీ గారి హీరోయిన్ కోసం పూరీ ఇంత ఖర్చు చేస్తున్నాడా? టాలీవుడ్ హిస్టరీలో ఈమెదే రికార్డ్.!

By Manoj

తక్కువ సినిమాలతో ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన అతడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ క్రేజీ కాంబినేషన్‌ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 'ఫైటర్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా గురించి కూడా చాలా ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

 విజయ్ కోసం స్పెషల్ ట్రీట్

విజయ్ కోసం స్పెషల్ ట్రీట్

విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్' వంటి హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అన్నీ పక్కాగా ఉండాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం ప్రత్యేకమైన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అలాగే విజయ్ మేనరిజమ్ కూడా అదిరిపోయేలా డిజైన్ చేస్తున్నాడని టాక్.

స్క్రిప్ట్ చూశాక భాగస్వామి అయ్యాడు

స్క్రిప్ట్ చూశాక భాగస్వామి అయ్యాడు

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్‌పై నిర్మిస్తాడని గతంలోనే ప్రకటించాడు. అదే సమయంలో ఈ సినిమాకు సీనియర్ హీరోయిన్ ఛార్మీ సహా నిర్మాతగా వ్యవహరించనుందని తెలిపాడు. అయితే, ఇటీవల ఈ సినిమా స్క్రిప్ట్ గురించి తెలుసుకున్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడని ప్రచారం జరుగుతోంది.

 ముగ్గురు కలిసి మార్చేశారు

ముగ్గురు కలిసి మార్చేశారు

కరణ్ జోహార్ కలిసిన తర్వాత ‘ఫైటర్' లెవెల్ భారీగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమాను తెలుగులో మాత్రమే కాకుండా.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కింబోతున్నారని ప్రచారం జరుగుతుండడమే. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందించడానికి ముగ్గురు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

అతిలోక సుందరి కూతురే

అతిలోక సుందరి కూతురే

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, విజయ్ సరసన నటించే హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేశారని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ వల్లే ఈమె ఇందులో నటిస్తుందని అంటున్నారు.

పూరీ ఇంత ఖర్చు చేస్తున్నాడా?

పూరీ ఇంత ఖర్చు చేస్తున్నాడా?

ఈ సినిమాలో నటించేందుకు గానూ జాన్వీ కపూర్‌కు నిర్మాత పూరీ జగన్నాథ్ రూ. కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈమె కోసం రూ. 3.50 కోట్లు కేటాయించారని అంటున్నారు. సినిమాలో యాక్టింగ్ చేయడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలకూ సమయం కేటాయించాలని ముందుగానే చెప్పారని సమాచారం.

టాలీవుడ్ హిస్టరీలో ఈమెదే రికార్డ్.!

టాలీవుడ్ హిస్టరీలో ఈమెదే రికార్డ్.!

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు హీరోలు రూ. కోటి తీసుకున్నారంటే ఆశ్చర్యంగా చూసేవారు. కానీ, రోజులు మారుతున్న కొద్దీ హీరోయిన్లు కూడా ఈ మొత్తం తీసుకున్నారు. ఇక, ఇటీవల హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ‘సాహో' కోసం శ్రద్ధా కపూర్ రూ. 3 కోట్లు తీసుకుందని ప్రచారం జరిగింది. ఆ రికార్డును జాన్వీ ఇప్పుడు బద్దలు కొట్టిందని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X