ఫైటర్ హీరోయిన్ ఫిక్స్: విజయ్‌కు జోడీగా స్టార్ డాటర్‌.. అడ్వాన్స్‌గా అంత ఇచ్చారా.!

By Manoj

టాలీవుడ్ బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన ప్రతి సినిమాలో హీరోకు ఓ రకమైన మేనరిజమ్ కనిపిస్తోంది. ఆయన మొదటి సినిమాలో నటించిన పవన్ కల్యాణ్ నుంచి ఇటీవల కలిసి పని చేసిన బాలకృష్ణ, రామ్ వరకు సరికొత్తగా చూపించాడు. ఇలాంటి డైరెక్టర్.. స్పెషల్ యాటిట్యూడ్ ఉన్న విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. స్టైల్‌ కా బాప్‌లుగా పేర్కొనే ఇద్దరు కలిసి చేయబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రారంభమవకపోయినా ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇది దాదాపుగా ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా వార్త..? వివరాల్లోకి వెళితే...

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్

పూరీ జగన్నాథ్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పటి వరకు చేసిన మూవీలన్నీ బీ, సీ సెంటర్లకు నచ్చేవిగా తెరకెక్కినవే. మధ్యలో పరాజయాలు ఎదురైనా ఆయన మాత్రం తన జోనర్ మార్చుకోలేదు. అందుకే ఇప్పుడు విజయ్‌తో చేసే సినిమాకు కూడా అలాంటి కథనే రెడీ చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ ఉత్సాహంతోనే మళ్లీ పెడుతున్నారు

ఆ ఉత్సాహంతోనే మళ్లీ పెడుతున్నారు

వరుస పరాజయాలు ఇబ్బంది పెట్టడంతో పూరీ జగన్నాథ్‌తో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకే ఆయన సొంతంగా ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. ఇందులోనే ‘ఇస్మార్ట్ శంకర్' సినిమాను తెరకెక్కించాడు. ఇది భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ఆ ఉత్సాహంతో విజయ్‌తో సినిమా కూడా సొంతంగానే నిర్మిస్తున్నాడు.

విజయ్ మామూలు ప్లాన్ చేయలేదుగా

విజయ్ మామూలు ప్లాన్ చేయలేదుగా

విజయ్ దేవరకొండ కొద్ది రోజుల నుంచి ముంబైలోనే తిరుగుతున్నాడు. దీనికి కారణం తన సినిమా ‘ఫైటర్'ను హిందీలోకి తీసుకెళ్లడం కోసమేనని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో చర్చలు జరిపి తన సినిమాలో భాగస్వామ్యం చేశాడని ప్రచారం జరుగుతోంది. కరణ్ ఎంటర్ అవడంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

 మమూలు సినిమాను అలా మార్చేశారు

మమూలు సినిమాను అలా మార్చేశారు

వాస్తవానికి ‘ఫైటర్'ను మొదట తెలుగులోనే చేయాలని అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఇందులోకి కరణ్ జోహార్ ఎంటర్ అయ్యారో.. అప్పటి నుంచి దీని రేంజ్ మారిపోయింది. ఈ సినిమాను తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో తెరకెక్కించాలని డిసైడ్ అయిపోయారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నాడని టాక్.

ఆ విషయంలో ఎన్నో అనుమానాలు

ఆ విషయంలో ఎన్నో అనుమానాలు

ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. మొదట ఇందులో జాన్వీ కపూర్ నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత కియారా అద్వాణి చేస్తుందనే టాక్ వినిపించింది. ఇక, ఈ మధ్య ఆలియా భట్‌ సెట్ అయిందని వార్తలు వచ్చాయి. వీళ్లతో పాటు సారా అలీ ఖాన్ సహా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో అంతా అయోమయానికి గురయ్యారు.

 భారీ అడ్వాన్స్ ఇచ్చి సెట్ చేశారు

భారీ అడ్వాన్స్ ఇచ్చి సెట్ చేశారు

విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్‌ను ఫిక్స్ చేసేశారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో నటించడానికి జాన్వీ కపూర్ సంతకం చేసేసిందని సమాచారం. ఇందుకోసం ఆమెకు రూ. కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమెను ఫైనల్ చేయడం వెనుక కరణ్ జోహార్ చక్రం తిప్పారని బీ టౌన్‌లో చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X