టాలీవుడ్ అంటే అంత చిన్నచూపా?.. జూనియర్ అతిలోక సుందరికి కాస్త ఎక్కువైనట్టుందే!
స్వర్గీయ శ్రీదేవీ తనయ జాన్వీ కపూర్‌కు తెలుగు చిత్ర సీమ అంటే చిన్న చూపు ఉన్నట్టు కనిపిస్తోంంది. ఈ మేరకు జాన్వీని సంప్రదించిన ఓ బడా నిర్మాతకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చినట్టు టాక్. జాన్వీ కపూర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్న దర్శక నిర్మాతలకు ఎదురుదెబ్బే తగులుతోన్నట్టు తెలుస్తోంది.

ధడక్‌తో వెండితెరకు పరిచయం..
మరాఠి చిత్రం సైరాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ధడక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఏమంతగా ఆడకపోయినా.. జాన్వీ కపూర్‌కు మాత్రం మంచి పేరే వచ్చింది. లుక్స్, జాన్వీ నటన అన్నీ సహజంగా ఉండటంతో హీరోయిన్‌గా సక్సెస్ అయింది.

పలు ప్రాజెక్ట్‌లో బిజీగా..
అయితే ధడక్ తరువాత మరోసారి వెండితెరపై కనిపించలేదు జాన్వీ. వెబ్ సిరీస్‌లు ఓ పక్క చేస్తూనే.. బడా ప్రాజెక్ట్‌లను కూడా లైన్లో పెడుతోంది. అయితే జాన్వీ కపూర్ నటింస్తున్న చిత్రాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. తఖ్త్, గుంజన్ సక్సెనా, రూహీ అఫ్జానా వంటి చిత్రాలు సెట్స్ మీదున్నాయి.

టాలీవుడ్ దర్శక నిర్మాతల ప్రయత్నాలు..
జాన్వీ కపూర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఇప్పటికే చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అందులో డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ ఫైటర్ చిత్రానికి జాన్వీని అనుకున్నారు కూడా. అయితే క్యారెక్టర్‌కు ప్రాధాన్యం లేదంటూ ఆఫర్‌ను తిరస్కరించింది.

కేవలం గ్లామర్ కోసమే..
తాజాగా మరో బడా నిర్మాత జాన్వీని సంప్రదిస్తే దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిందట. తెలుగు సినిమాల్లో కథానాయిక పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని, కేవలం గ్లామర్ డాళ్‌గానే చూపిస్తారని, పైగా ఇక్కడ హీరోలు, దర్శకుల డామినేషన్ ఎక్కువని తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేసిందట జాన్వీ. అయితే బాలీవుడ్‌లో కూడా అదే పద్దతి కొనసాగుతూ ఉన్నా, కమర్షియల్ చిత్రాలే చేస్తూ ఉన్నా.. కేవలం టాలీవుడ్‌కు వచ్చేసరికే అవన్నీ గుర్తుకొస్తున్నాయా? అని చెవులు కొరుక్కుంటున్నారట. జాన్వీకి టాలీవుడ్ అంటే ఎందుకుంత చిన్న చూపో.. ఆమెకే తెలియాలి.


Click it and Unblock the Notifications











