»   » విదేశీయుడితో శృతి హాసన్‌ ఎఫైర్ నిజమే? కమల్ హాసనే సాక్ష్యం (ఫోటోస్)

విదేశీయుడితో శృతి హాసన్‌ ఎఫైర్ నిజమే? కమల్ హాసనే సాక్ష్యం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ కు సంబంధించిన ఫోటో ఇటీవల ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. విదేశీ యువకుడితో ఆమె చట్టాపట్టాలేసుకుని కనిపించడంతో ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ యువకుడు ఎవరా అని ఆరా తీస్తే లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సేల్ అని తెలిసింది.

తాజాగా శృతి హాసన్ ఎఫైర్ గురించి మరింత క్లారిటీ వచ్చింది. కమల్ హాసన్ తో కూడా అతడు కనిపించడంతో ఈ విషయం శృతి హాసన్ ఫ్యామిలీకి కూడా తెలుసని, ప్రస్తుతం అతడు శృతి హాసన్ తో సహజీనవం చేస్తున్నట్లు అంతా భావిస్తున్నారు.

కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య పరిచయం ఉందని, వాలంటైన్స్ డే సందర్భంగా శృతితో గడిపేందుకు లండన్ నుండి ముంబై వచ్చాడని సమాచారం. కొన్ని రోజులు ఇద్దరూ కలిసి ఒకే అపార్టుమెంటులో ఉన్నారని ముంబై టాక్.

కమల్ హాసన్ కూడా కలిసాడు

కమల్ హాసన్ కూడా కలిసాడు

యూకె-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్-2017 సదస్సుకు హాజరైన కమల్ హాసన్ లండన్ లో మైఖేల్ కోర్సేల్ ను కలిసాడు. తన బాయ్ ఫ్రెండ్ గురించి, అతడితో సహజీవనం గురించి శృతి ముందే తన తండ్రికి చెప్పినట్లు సమాచారం.

కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్

కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్

కమల్ హాసన్ కూతురు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాడట. కమల్ హాసన్ వయసులో ఉన్నపుడు నటి సారికతో సహజీవనం చేసి శృతి హాసన్ పుట్టిన తర్వాతే సారికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సారికతో విడిపోయిన తర్వాత గౌతమితో చాలా కాలం కమల్ హాసన్ సహజీవనం చేసారు. కమల్ దృష్టిలో ఇవన్నీ చాలా కామన్... అందుకే ఆయన నుండి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం అవుతోంది.

ఎలా పరిచయం?

ఎలా పరిచయం?

మైఖేల్, శృతి హాసన్ తొలాసారిగా లండన్ లో కలిసారని, బ్రిటిష్ ఆల్టర్నేటవ్ రాక్ బ్యాండ్ తో కలిసి రికార్డింగ్ కోసం లండన్ వెళ్లినపుడు అతడు పరిచయం అయ్యాడని, ఇద్దరూ ఒకరికొకరు నచ్చడం, అభిప్రాయాలు కలవడంతో చాలా క్లోజ్ అయ్యాడని టాక్.

శృతి హాసన్ సైలెంట్

శృతి హాసన్ సైలెంట్

తమ ఇద్దరి గురించి మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నా శృతి హాసన్ మౌనంగానే ఉంటున్నారు. సాధారణంగా శృతి హాసన్ తన పర్సనల్ ఎఫైర్స్ గురించి మాట్లాడానికి పెద్దగా ఇష్టపడరు. అందుకే ఈ మ్యాటర్ మీద అస్సలు నోరు విప్పడం లేదు.

శృతి హాసన్ బికినీ ఫోటో షూట్

శృతి హాసన్ బికినీ ఫోటో షూట్

సౌత్‌లో శృతి హాసన్ కెరీర్ బాగానే సాగుతోంది. ఇక్కడ పలు హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే బాలీవుడ్లోనే ఆశించిన స్థాయిలో శృతి హాసన్ కెరీర్ సాగడం లేదు. బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువగా గ్లామర్‌తోనే ముడిపడి ఉంటాయి. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది ఈ చెన్నైబ్యూటీ. శృతి హాసన్ బికినీ ఫోటో షూట్ కోసం క్లిక్ చేయండి.

English summary
Kamal Haasan, who was recently in London to attend the UK-India Year of Culture-2017, was snapped with daughter Shruti's rumoured boyfriend Michael Corsale.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu